Breaking News

శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్ర చూడ్ బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జస్టిస్ చంద్ర చూడ్ కు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు సాంప్రదాయ బద్ధంగా స్వాగతించారు. ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం జస్టిస్ చంద్ర చూడ్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు శేషవస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం చేశారు . అనంతరం సిజె ఐ కి చైర్మన్,ఈవో స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీ చంద్ర చూడ్ దంపతులు ఆలయంలో గోపూజలో పాల్గొన్నారు. గోవు, దూడకు పూజలు చేసి గ్రాసం తినిపించారు. జిల్లా జడ్జి వీర్రాజు , టీటీడీ సివిఎస్వో నరసింహ కిషోర్, ఆర్డీవో కనక నరసారెడ్డి , డిప్యూటీ ఈవో వరలక్ష్మి , విజివో మనోహర్, అదనపు ఎస్పీ కులశేఖర్, డిఎస్పీ నరసప్ప , ఆలయ ప్రధాన అర్చకులు పార్థ సారధి, బాలాజి రంగాచార్యులు ఆలయ సూపరింటెండెంట్ ముని చంగలరాయులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *