Breaking News

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్ర చూడ్ బుధవారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జస్టిస్ చంద్ర చూడ్ కు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో సాంప్రదాయ బద్ధంగా స్వాగతించారు. ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం జస్టిస్ చంద్ర చూడ్ దంపతులు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు అమ్మవారి శేష వస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం చేశారు . అనంతరం ఆశీర్వాద మండపంలో సిజె ఐ కి చైర్మన్, ఈవో అమ్మవారి ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సన్మానించారు. గౌ.మూడవ అదనపు జిల్లా జడ్జి వీర్రాజు , టీటీడీ సివిఎస్వో నరసింహ కిషోర్, డిప్యూటీ ఈవో శాంతి, విజివో మనోహర్, ఏఎస్పీ కులశేఖర్, డిఎస్పీ మురళీ కృష్ణ, ఆలయ ఏఈవో ప్రభాకర్ రెడ్డి ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు అర్చకులు బాబు స్వామి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *