Breaking News

మతసామరస్యం, శాంతికి ప్రతీక అజ్మీర్ షరీఫ్ దర్గా

-ఖాజా బాబా ఆశ్రమం 7వ వార్షికోత్సవ వేడుకల పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజస్థాన్ రాష్ట్రంలోని పుణ్య ధామం అజ్మీర్ షరీఫ్ “సుఫీ సెయింట్ హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి హసన్ సంజరి రజి అల్లాహు అన్ హు మహాత్ముల వారి పవిత్ర దర్గా మతసామరస్యానికి, శాంతికి ప్రత్యేకగా నిలుస్తుందని కృష్ణాజిల్లా ఎమ్మెల్సీ ఎండి రూహుల్లా అన్నారు. 2023 జనవరి 29న జరగనున్న ఖాజా బాబా ఆశ్రమం 7 వ వార్షికోత్సవ వేడుకలు, అజ్మీర్ షరీఫ్ ఉరుసు మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను విజయవాడ అజిత్ సింగ్ నగర్ కార్యాలయం ఆవరణలో కొండపల్లి బి కాలనీ షాబుఖారి బాబా నిత్య అన్నదాన నిర్వహకులు అల్తాఫ్ బాబా, 59వ డివిజన్ కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానా హఫీజుల్లా, ముస్లిం మైనార్టీ పెద్దలతో కలిసి గురువారం అజ్మీర్ ఎమ్మెల్సీ రుహుల్లా ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీ లో ఉన్న ఖాజా బాబా ఆశ్రమం వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరగాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భారతదేశంలోనే అత్యంత ప్రఖ్యాత కలిగిన
అజ్మీర్ షరీఫ్ దర్గా ఉరుసు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సర్వమానవాళి సంక్షేమాన్ని కోరుతూ దువా చేశారు. ఈ కార్యక్రమంలో ఖాజా బాబా ఆశ్రమ కమిటీ వ్యవస్థాపక ధర్మకర్త , సినీయర్ జర్నలిస్ట్ పఠాన్ బాబ్జి ఉమర్ ఖాన్, ముస్లిం మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *