– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు నాట ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాల నేపథ్యంలో నియోజకవర్గ ప్రజానీకానికి రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత ఊర్లపై మమకారానికి, వ్యవసాయానికి, పెద్దలకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. పశుపక్షాధులు, ప్రకృతితో అనుసంధానమైన రైతన్నల పండుగ. భోగిమంటల వెలుగులు, రంగవల్లులు, వేకువజామునే తలంటు స్నానాలు, పిండి వంటలు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసు కీర్తనలు, గాలిపటాల సందళ్లు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలి. రాష్ట్రంలో బంగారు పంటలు పండేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు దిగ్విజయంగా ముందుకు సాగాలి. ప్రతి పల్లె పాడిపంటలతో కళకళలాడుతూ.. రైతులు, గ్రామీణ వృత్తుల వారంతా సుఖసంతోషాలతో ఉండాలి. అన్ని వర్గాల ప్రజల అభివృద్దికి, సమాజ హితానికి ఈ సంక్రాంతి శుభకరం కావాలి, ఇంటింటా కొత్త ఆనందాలను నింపాలని మనసారా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని దేశంలో అగ్రపథాన నిలిపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు దిగ్విజయంగా ముందుకు సాగేలా దీవించాలని అమ్మవారిని ప్రార్థించారు.