Breaking News

సిరులను ఇచ్చే సంక్రాంతి

-తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు, ప్రత్యేకించి రాష్ట్ర ప్రజానీకానికి ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియ జేశారు. భోగి మంటలు, రంగ వల్లులు, హరి దాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, ధాన్యపు సిరులు గ్రామ సీమలకు సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని గవర్నర్ పేర్కొన్నారు. సంక్రాంతి మన సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే అచ్చ తెలుగు పండుగ అన్నారు. పండుగ శుభవేళ తెలుగు లోగిళ్ళలో ఆనంద సిరులు వెల్లివిరియాలన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వ దినాలను ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని. ఈ పండుగ సంబరాలు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో పురోగతిని తీసుకురావాలని గవర్నర్ హరిచందన్ ఆకాంక్షించారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *