విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తేటతెలుగు పదాలతో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శతకాల ద్వారా సమాజాన్ని జాగ్రుతం చేశారని అధికార భాషా సంఘం అధ్యక్షులు పి. విజయబాబు అన్నారు. రాష్ట్ర అధికార భాషా సంఘం ఆధ్వర్యంలో గురువారం ప్రజా కవి యోగి వేమన జయంతిని పురస్కరించుకుని విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి అధికార భాషా సంఘం అధ్యక్షులు పి. విజయబాబు ముఖ్య అతిధిగా హాజరై జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావుతో కలిసి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా విజయబాబు మాట్లాడుతూ వేమన పద్యాలు సామాజిక చైతన్యానికి నిదర్శనం అన్నారు. సమాజంలోని సమస్యలను విభిన్న కోణాలలో దర్శించి వాటి వైశిస్ట్యాన్ని పద్యాల రూపంలో ప్రజలకు అందించారన్నారు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు మతం పేరుతో జరుగుతున్న దోపిడీలు విగ్రహరాధనను నిరసించడం వంటి అనేక సామాజిక లోటుపాట్లపై వేమన తన కలం ద్వారా వివరించారన్నారు. ఆయన పద్యాల ద్వారా నీతిని చాటిచెప్పారన్నారు. మానవతాదర్మం, సర్వ మానవ సమానత్వం, నైతిక విలువలు మూడనమ్మకాలు, సంఘ సంస్కరణలు, కుల విచక్షణలోని డొల్లతనం గుర్తించి తన పద్యాలలో సూటిగా పొందుపరచిన మహ కవి యోగి వేమన అని కొనియాడరు. ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు చేత యోగి వేమన జీవిత చరిత్రను వ్రాయించి కేంద్ర సాహిత్య అకాడమి 14 భాషలలో అనువదింపజేయడం జరిగిందని ఆంగ్ల ఐరోపా భాషలన్నిటిలోను ద్రావిడ భాషలలోను వేమన పద్యాలు అనువదించబడ్డాయని అన్నారు. తెలుగు బాషలోని ఏ కవికి ఇంతటి గౌరవం లభించలేదన్నారు. వేమన పద్యాలను నేటి తరంలోని ప్రతి ఒక్కరూ చదివి వాటిలోని సారంశాన్ని తెలుసుకుని సామాజిక విలువలను కాపాడడంలో భాగస్వాములు కావాలని విజయబాబు కోరారు.
జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మట్లాడుతూ 17వ శతాబ్థం నాటి వేమన రచనలను, పద్యాలను 20వ శతాబ్ధంలో కూడా స్మరించుకుంటున్నామంటే వాటికి ఉన్న విలువలను నేటి తరం గుర్తుంచుకోవాలన్నారు. ప్రజా కవి సంఘ సంస్కర్త యోగి వేమన సామాన్య పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో రచించిన పద్యాలు సామాజిక చైతన్యానికి ఎంతో దోహదపడుతున్నాయన్నారు. ఆయన రచించిన పద్యాలు సామాజిక చైతన్యాన్ని తీసుకువచ్చాయన్నారు. వేమన రచించిన ఒక్కొక్క పద్యం ఒక్కొక్క గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు. నాలుగు పంక్తులలో రచించిన పద్యంలో పూర్తి సారాంశాన్ని వివరణను నీతిని బోదిస్తాయన్నారు. వేదాంత సారాన్ని చిన్న పద్యంలో పొందుపరచి పామరులకు అర్థమయ్యే రీతిలో ప్రబోధించి ప్రజా కవిగా ముద్ర వేసుకున్నారన్నారు. వేమన పద్యాన్ని ప్రతి రోజు కనీసం ఒక పద్యాన్ని పఠనం చేయాలని సూచించారు.
అనంతరం వేమన శతకంపై నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ బహుమతిగా 10 వేల రూపాయలు, ద్వితీయ బహుమతిగా 6 వేల రూపాయలు, తృతీయ బహుమతిగా 4 వేల రూపాయలను జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆయన వ్యక్తిగతంగా అందించి విద్యార్థులను ప్రోత్సహించారు. ఉత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థులకు వేమన శతకం పుస్తకాలు, ప్రశంసా పత్రాలను భాషా సంఘం విజయబాబు అందజేశారు.
కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ కళాశాల ప్రిన్సిపల్ కె. భాగ్యలక్ష్మి, ఏపిఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వివి కృష్ణంరాజు, అధికార భాషా సంఘం సభ్యులు జి. రామచంద్రరెడ్డి కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …