Breaking News

ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎస్సీల సంక్షేమానికి కట్టుబడి ఉండాలని షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు ఎర్రగుడి చంద్రబాబు కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సోమవారం షెడ్యూల్డ్ క్యాస్ట్స్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్రస్థాయి కార్యవర్గ జనరల్ బాడీ సమావేశము జరిగినది. ఈ సమావేశంలో మొదటగా ” నూతన రాష్ట్ర బాడీ” ఎన్నుకున్నట్లు నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులుఎర్రగుడి చంద్రబాబు తెలిపారు. ఉపాధ్యక్షులు గా శ్రీరాముల దేవదానం, అంగలకుర్తి యేసన్న, ప్రధాన కార్యదర్శి కరేటీ రమేష్, కార్యదర్శులు గా మేకల శేఖర్ , కైలా రాంబాబు, కోశాధికారి గా జెల్లి ఓబులేసు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొదమల డేవిడ్ రాజు, రాష్ట్ర ఉద్యోగ విభాగ అద్యక్షులు గా పాదం చంద్రశేఖర్, రాష్ట్ర మహిళా అధ్యక్షరాలు గా కొట్టేటి సరితా రాజేశ్వరి, రాష్ట్ర కార్మిక శాఖ అధ్యక్షులు గా అగిలి సురేష్, రాష్ట్ర ఈసీ మెంబర్ – నాగులారపు ఓబయ్య, రాష్ట్ర న్యాయ సలహాదారులు గా జయాకర్, రాష్ట్ర పరిశ్రమల విభాగ అధ్యక్షులు కటికల రవి కుమార్ లు ఎన్నికైనట్లు వెల్లడించారు. ప్రస్తుత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దళితులను నిర్లక్ష పరస్తున్న 27 సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్దరించాలనీ, ఎస్సీ సంక్షేమానికి కట్టుబడి వుండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె ఎక్కించిన ఎస్సీ ,ఎస్టీలు గద్దె దించడానికి కూడా వెనుకాడకుండా ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎస్సీ కార్పోరేషన్ ఋణాలను, పారిశ్రామిక ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చంద్రబాబు డిమాండ్ చేశారు. ముందుగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బండి శ్రీనివాసులు, మైనార్టి నాయకులు షేక్ గౌస్, నాగేంద్ర, పచ్చల అంబేద్కర్, మండెపూడి రాజు, పట్టేట భాగ్యరాజు, దండిపోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *