-జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేధిక స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఏ యొక్క అర్జీ రీ ఒపెన్ కాకూడదన్నారు. అర్జీలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ ద్వారా అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలన్నారు. స్పందనలో నమోదైన ప్రతి ధరఖాస్తును సీరియస్‌గా తీసుకుని పరిష్కరించడంతోపాటు విచారణ నివేదికను అప్‌లోడ్ చేయవలసి వుంటుందన్నారు. స్పందనలో శాఖల వారిగా పరిశీలిస్తే ఎక్కువగా నమోదవుతున్న రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అండ్ అర్భన్ డెవలప్‌మెంట్ తదితర శాఖల అధికారులు అర్జీల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం స్పందన ఫిర్యాదుల పరిష్కారం పై దృష్టి పెడుతునందున అర్జీదారులకు సత్వర న్యాయం చేయడమే లక్ష్యంగా అధికారులు విధులను నిర్వర్తించాలన్నారు. అర్హత ఉన్నప్పటికి సంక్షేమ పథకాలు అందకపోవడం, ఎవరికైనా అన్యాయం జరిగిన సందర్భంలో ఫిర్యాదు వస్తే విచారించి నిర్థేశించిన గడువులోగా పరిష్కరించాలన్నారు. స్పందన అర్జీలతో పాటు ఏపి సేవా డాష్ బోర్డు, టోల్ ఫ్రీ నెంబర్1902, అన్‌లైన్‌లోను నమోదు అవుతున్న అర్జీలను పెండిరగ్ లేకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
నేటి స్పందనలో 103 వినతులు నమోదు కాగా వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖలో 24, పోలీస్ 20, యంఎయుడి 10, పంచాయతీరాజ్ 11, విభిన్నప్రతిభావంతులు 8, హౌసింగ్ 5, ఉపాధి కల్పన 5, సర్వే అండ్ సెటిలిమెంట్ 4, అగ్రికల్చర్ 3, వైద్య ఆర్యోగ శాఖ 2, డ్వామా 2, మైనార్టి వెల్ఫేర్ 1, విద్య 1, ఐసిడిఎస్ 1, ఆర్‌డబ్ల్యుఎస్ 1, మత్స్య 1, ఏపిఎస్‌పిడిసిఎల్ 1, కాలుష్య నియంత్రణ మండలి 1, పౌర సరఫరాల శాఖ 1, గ్రామ వార్డు సచివాలయం 1 శాఖలలో అర్జీలు నమోదయ్యాయన్నారు. జిల్లాలోని డివిజనల్ అధికారులు, ఆయా మండలాల యంపిడీవోలు, తహశీల్థార్లు, మున్సిపల్ కమిషనర్లతో వర్చువల్‌గా జిల్లా కలెక్టర్ పరిష్కారమయ్యే వినతులను అక్కడికక్కడే పరిష్కరించారు.
స్పందన కార్యక్రమంలో డ్వామా పిడి జె. సునీత, డిఎస్‌వో పి కోమలి పద్మ, ఐసిడిఎస్ పీడి జి. ఉమాదేవి, జిల్లా సర్వే అధికారి కె. సూర్యారావు, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, డిసివో సిహెచ్ శైలజ, డిఆర్‌డిఏ పీిడి కె. శ్రీనివాసరావు, పశుసంర్థక శాఖ జెడి కె. విద్యాసాగర్, ఉద్యాన శాఖ జిల్లా అధికారి బాలాజీ కుమార్, హౌసింగ్ పీడి శ్రీదేవి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి యం. విజయభారతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.