Breaking News

హెపటైటిస్‌ బి నిరోధక టీకా వ్యాక్సిన్‌…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హెచ్‌.ఐ.వి/ హై రిస్క్‌ గ్రూపులకు చెందిన వారు హెపటైటిస్‌ బి నిరోధక టీకా వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా కాలేయ వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చునని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. స్థానిక పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని యాంటీ రెట్రో వైరల్‌ థెరఫీ (ఏఆర్‌టి) కేంద్రంలో సోమవారం ఉచిత హెపటైటిస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హెపటైటిస్‌ బి వ్యాధి నిరోధక టీకా వ్యాక్సిన్‌ను అన్ని ఏఆర్‌టి కేంద్రాలలో నేటి నుండి ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. హెచ్‌ఐవి / హై రీస్క్‌ గ్రూపుల వారికి హెపటైటిస్‌ బి సోకే అవకాశం ఎక్కువ కాబట్టి హెపటైటిస్‌్‌ బి నిరోధక టీకాలు తీసుకోవడం ద్వారా వ్యాధి బారిన పడకుండా రక్షణ పొందవచ్చునన్నారు. ప్రతి ఒక్కరూ మూడు డోసులు క్రమం తప్పకుండా తీసుకుని హెపటైటిస్‌ బారిన పడకుండా కాపాడుకోవాలని సూచించారు. ఏఆర్‌టి సెంటర్‌లో అందిస్తున్న వైద్య సేవలు బాగున్నాయని, ఇదే స్పూర్తితో సిబ్బంది సమన్వయంతో పనిచేసి మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా హెచ్‌ ఐ వి రోగులను ఏఆర్‌టి సెంటర్‌లో అందుతున్న సేవలు, వారికి అందిస్తున్న పింఛన్‌ల గురించి అడిగి తెలుసుకున్నారు. నగరంలోని పాత, కొత్త ప్రభుత్వాసుపత్రులలోని ఏఆర్‌టి సెంటర్‌లలో ఉచిత వ్యాక్సినేషన్‌ జరుగుతుందన్నారు. స్వచ్చంద సంస్థల సహకారంతో టార్గెటెడ్‌ ఇంటర్వెన్షన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా హెచ్‌ ఐవి తో జీవించేవారు హైరిస్క్‌ గ్రూపునకు చెందిన సెక్స్‌ వర్కర్లు, స్వలింగ సంపర్కులు ట్రాన్స్‌జండర్లు వలసదారులకు ఉచితంగా హెపటైటిస్‌ బి వ్యాక్సిన్‌ వేయనున్నట్లు కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారిణి డా. మాచర్ల సుహాసిని గాస్ట్రో ఎంట్రాలజీ హెచ్‌ఎడీ డాక్టర్‌ జగన్‌మోహన్‌్‌రావు, జిల్లా అధనపు వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.జూపూడి ఉషారాణి, ఆసుపత్రి సూపరిండెంట్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ డా. సౌభాగ్యలక్ష్మి, జిల్లా ఇమ్యునైజేషన్‌ ఆఫీసర్‌ డా.అమృత, డిప్యూటి సూపరింటెండెంట్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *