-రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. జవహర్ రెడ్డి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలలో రీసర్వే వేగవంతం చేయాలని, జాతీయ రహదారుల భూసేకరణ, గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని,. ఈ కే వై సీ వరి ధాన్య సేకరణ నమోదు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
గురువారం రీ సర్వే, ఇంటి స్థలాలు, హౌసింగ్, పంచాయతీ రాజ్, గ్రామీనాభివృద్ధి శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖల అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంబంధిత కార్యదర్శులతో అమరావతి నుండి వర్చువల్ విధానంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి జెసి డి కే బాలాజీ సంబంధిత జిల్లా అధికారులతో హాజరయ్యారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశమై జిల్లాలో చేపడుతున్న భూహక్కు భూ రక్ష రీసర్వే లో గ్రౌండ్ వ్యాలిడేషన్, డి ఎల్ ఆర్ పబ్లిష్ చేయడం హక్కు పత్రాలు అందజేయడం వంటివి ఫిబ్రవరి మాసాంతానికి పూర్తి చేయాల్సి వుంటుందని అన్నారు. స్పందన అర్జీలపై సకాలంలో స్పందించి బియాండ్ ఎస్. ఎల్. ఎ కు వెళ్లకుండా అర్థవంతమైన పరిష్కారం అర్జీదారులకు చూపాలని, రెవెన్యూ అంశాలు మరింత జాగ్రత్తగా పరిశీలన, త్వరిత గతిన అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించాలని ఈ అంశం ఉన్నత స్థాయిలో సమీక్షిస్తున్నారని అన్నారు.
వ్యవసాయశాఖ కు సంబంధించి 90 శాతం ఈ కే వై సి మరియు వరి ధాన్య సేకరణ 92 శాతం నమోదు పూర్తి చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నామని అన్నారు. సూపర్ చెక్ విధానంలో తాసిల్డార్లు, ఆర్డీవో లు, అగ్రికల్చర్ అధికారులు తనిఖీ చేపట్టాలని అన్నారు. హార్టికల్చర్, ఎ పి ఎం ఐ పి అధికారులు కూడా లక్ష్యాల మేరకు శత శాతం అందిపుచ్చుకోవాలి అని అన్నారు. జగనన్న పాల వెల్లువ పై సమీక్షిస్తూ పాల సేకరణ కేంద్రాల పెంపు, ఎఎంసియు, బిఎంసియు నిర్మాణాలు వేగవంతం చేయాలని అన్నారు. పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో ఉగాది నాటికి నిర్దేశించిన విధంగా గృహ ప్రవేశాలు ప్రారంభం అయ్యేలా వివిధ స్టేజిలో ఉన్నవాటిని పూర్తి చేసే దిశగా వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇంటి నిర్మాణాలకు ఎస్. హెచ్. జి. ల ద్వారా అదనపు రుణం లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కేటగిరీ 3 లేఔట్లలో తాగు నీటి కొళాయిలు ఏర్పాటు, విద్యుత్తు కనెక్షన్స్, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అత్యంత ప్రాధాన్యత పనులకు అనుమతులు ఇచ్చిన వాటిలో పనులు వివిధ దశలలో ఉన్నవాటిని వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ పి డీ వెంకటేశ్వర్లు, డ్వామా పి డి శ్రీనివాస ప్రసాద్, జిల్లా సర్వే అధికారీ జయరాజ్, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి విజయ్ కుమార్, జిల్లా పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్ అధికారి శంకర్ నారాయణ, జిల్లా మత్స్యశాఖ అధికారి చాంద్ భాషా, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.