Breaking News

గర్భస్థ లింగ నిర్ధారణ తెలియపరిచే స్కానింగ్ సెంటర్లను గుర్తించి వాటిపై డేకాయ్ ఆపరేషన్ నిర్వహించి గట్టి నిగా ఉంచాలి…

-డి ఎం హెచ్ ఓ డా. కే వెంకటేశ్వరరావు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గర్భస్థ లింగ నిర్ధారణ తెలియజేసే స్కానింగ్ సెంటర్లను గుర్తించి వాటిపై డేకాయ్ ఆపరేషన్ నిర్వహించి గట్టి నిగా ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి డా. కే వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి కార్యాలయంలో పిసిపిఎన్ డి టి యాక్ట్, గర్భస్థపూర్వ మరియు గర్భస్థలింగ నిర్ధారణ చట్టం అమలులో భాగంగాజిల్లా స్థాయి సలహా సమావేశము డి ఎం హెచ్ ఓ డా. కే వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా లో ఉన్న అన్ని స్కానింగ్ సెంటర్ నందు తనిఖీలు నిర్వహించాలని, అదేవిధంగా లింగ నిర్ధారణ తెలియపరిచే స్కానింగ్ సెంటర్లను గుర్తించి వాటిపై డేకాయ్ ఆపరేషన్ నిర్వహించి గట్టి నిగా ఉంచాలని వైద్యాధికారులకు సూచించారు. జిల్లాలోని ఏ స్కానింగ్ సెంటర్ లో నైనా
లింగ నిర్ధారణ తెలియపరిచినట్లు రుజువైనచో వాటి నిర్వహణ ఆపివేయాలని పర్యవేక్షణ బృందాలకు సూచనలు జారీ చేశారు.

ఈ నెల జనవరి 31 వ తేదీన జిల్లా అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ నందు కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ కె మాధవీలత ఆదేశాలు మేరకు మేరకు సెక్స్ రేషియో 600 కంటే తక్కువ ఉన్న మండలాలలో పర్యవేక్షణ చేసి తగిన కారణాలు తెలుసుకోవాలని ఎక్కువగా అబార్షన్ రేటు ఉన్న ఆస్పత్రులపై తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డివిజన్ స్థాయి నందు నిర్వహించే సబ్ డిస్ట్రిక్ట్ అప్రాపరేట్ అథారిటీ కమిటీ మరియు సబ్ డిస్టిక్ అడ్వైజరీ కమిటీ నిర్నేత కాలంలలో సమావేశంలో నిర్వహించడం, ప్రతి సచివాలయం, పీహెచ్సీ అంగనవాడి సమావేశములలో అన్ని అధికారిక సమావేశములలోను లింగ నిర్ధారణ చట్టం అమలు పై ప్రజలకు అవగాహన కలిగించాలని పేర్కొన్నారు. లింగ నిష్పత్తిని పెంచడానికి అందరూ కృషి చేయాలని తెలియజేశారు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినప్పుడు రెవెన్యూ, పోలీసు అధికారులు స్థానిక అధికారులు తో కలసి వెళ్లి తనిఖీ చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డా. శైలజ గైనకాలజిస్ట్,
డా.నాయకర్ పీడియాట్రిషన్, డా.శ్రీవల్లి, డా.మౌనిక
డెమో ఇన్చార్జ్ ఎన్. సత్యకుమార్,,
ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నా సంకల్పం… నా దేశం కోసం!

– ఆగస్టు 10 నుంచి 15 వరకు “Partners in Nation Building – #AneNenu” కార్యక్రమం – స‌మాజంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *