Breaking News

తిరుపతి ఈ ఎం సి లో 10 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో 29000 మందికి ఉపాధి కల్పన కు ఎంఓయు లు : సి ఈ ఓ, ఈఎంసి గౌతమి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, ప్రోత్సహించడానికి మార్చి 3, 4 తేదిలలో ఏర్పాటు చేసిన రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 లో భాగంగా నేడు తిరుపతి కడప జిల్లాల పరిధిలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ల లో పరిశ్రమల స్థాపనకు మరియు పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ముందుకు వచ్చి ఎం ఓ యు లు మార్పిడి జరిగిందని ముఖ్య కార్యనిర్వహణాధికారి (సి ఈ ఓ) ఈ ఎం సి గౌతమి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం విశాఖ లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 కార్యక్రమం ఆంద్ర విశ్వ విద్యాలయంలో అడ్వాంటేజ్ ఆంధ్ర ప్రదేశ్ అనే నినాదంతో పరిశ్రమల స్థాపనే లక్ష్యంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రెండు రోజుల కార్యక్రమంలో పలు పరిశ్రమల యాజమాన్యాలు, ఔత్శాహిక పారిశ్రామిక వేత్తలు పాల్గొని ఎం ఓ యు లు మార్పిడి చేసుకున్నారని సి ఈ ఓ , ఈ ఎం సి అన్నారు. అందులో తిరుపతి కడప ఈ ఎం సి క్లస్టర్ల పరిధిలో పరిశ్రమల స్థాపనకు ఎంతో అనుకూల పరిష్టితులు ఉన్నాయని రోడ్డు , రవాణా, రైలు మార్గము, విమానాశ్రయం కలిగి అనుకూల రవాణా మార్గాలు ఉన్నాయని, అలాగే మానవ వనరులకు కేంద్ర విద్యా సంస్థలు, విశ్వ విద్యాలయాలు తదితర అత్యంత సౌకర్యవంతమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సింగల్ డెస్క్ విధానంలో పరిశ్రమల స్థాపనకు అన్ని అనుమతులు త్వరితగతిన అందించి పరిశ్రమల స్థాపనకు ప్రోత్శాహిస్తోందని, అందులో భాగంగా నేటి రోజు ఈ ఎం సి క్లస్టర్ల పరిధిలో సుమారు రూ. 10,072 కోట్ల పెట్టుబడితో 29000 మంది యువతకు ఉపాధి కల్పన దిశగా 8 ప్రముఖ కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు.

ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్- 1, 2 పరిధిలో సన్నీ ఒప్పో టెక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ మొబైల్ కెమెరా మాడ్యూల్స్ రూ. 2500 కోట్లు టి సి ఎల్ గ్రూప్ ప్యానెల్ మాన్యుఫాక్చరింగ్ రూ. 5000 కోట్లు పెట్టుబడి ఉపాధి కల్పన 5000 , క్లైర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎల్ ఈ డి మాన్యుఫాక్చరింగ్ రూ. 90 కోట్లు పెట్టుబడితో ఉపాధి కల్పన 3000, నియో లింక్ గ్రూప్ 5 జి ప్రొడక్ట్స్ మాన్యుఫాక్చరింగ్ రూ. 300 కోట్లు పెట్టుబడితో ఉపాధింకల్పన 3000, ఎస్ 2 పి సోలార్ సిస్టం ఎల్ ఎల్ పి కంపెనీ సోలార్ సెల్ మాన్యుఫాక్చరింగ్ రూ. 850 కోట్లు పెట్టుబడితో ఉపాధి కల్పన 900, సెల్కన్ రేసోల్యుట్ కంపెనీ ఎల్ ఎల్ పి ప్యానెల్ అండ్ టి వి మాన్యుఫాక్చరింగ్ రూ. 1200 కోట్లు ఉపాధి కల్పన 5500, వర్చువల్ మేజ్ కంపెనీ జి పి ఎస్ ట్రాకర్ ఈ వి బ్యాటరీ పి సి బి రూ. 80 కోట్లు పెట్టుబడితో ఉపాధి కల్పన 1400, టెక్నో డోమ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ టి వి మాన్యుఫాక్చరింగ్ రూ. 52 కోట్లు పెట్టుబడితో ఉపాధి కల్పన 200 దిశగా నేడు  ముఖ్యమంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి, పలువురు మంత్రులు, పారిశ్రామిక వేత్తల, ఐ టి సెక్రెటరీ సౌరభ్ గౌర్, సి ఈ ఓ ఈ ఎం సి గౌతమి సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్పిడి చేసుకున్నారు. ఇది ఒక గొప్ప శుభ పరిణామమని ఇంకా ఔత్శాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టాలని ఆ ప్రకటనలో కోరారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *