మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మండలంలోని చండ్రగూడెం, పుల్లూరు గ్రామాలలో స్టేట్ ఫుడ్ కమీషన్ సభ్యులు లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో బృందం శుక్రవారం అంగన్వాడీ సెంటర్, రేషన్ షాప్, పుల్లూరు హై స్కూల్ లో మధ్యాహ్న భోజన పధకం అమలును ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈసందర్భంగా ఈ బృందం పుల్లూరు ప్రభుత్వ పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. పుల్లూరు ప్రభుత్వ పాఠశాలలో రాకార్డుల్లో నమోదు చేసిన దానికంటే తక్కువగా అన్నం వండినట్లు తనిఖీ బృందం గుర్తించింది. స్కూల్ ప్రథానోపాద్యాయులు నారాయణరావుని తనిఖీ బృందం ప్రశ్నించింది. మిడ్ డే మీల్స్ అమలులో అవకతవకలు జరుగుతున్నట్లుగా తనిఖీ బృందం ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చింది. అవకతవకలకు భాద్యులైన వారిపై చర్యలకు సిఫారసు చేయనున్నట్లు బృందం వెల్లడించింది. అనంతరం చండ్రగూడెంలోని రేషన్ షాపు, అంగన్వాడీ సెంటర్ ను బృందం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి రికార్డులు, స్టాక్ రిజిస్టర్, స్టాకును పరిశీలించారు. అంగన్వాడీ సెంటర్లో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, ప్రభుత్వ పరంగా అందాల్సిన పథకాలపై అరా తీశారు. ప్రభుత్వ పథకాల అమలుపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ బృందంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీమతి కోమలి పద్మ జిల్లా విద్యాశాఖాధికారిణి రేణుక, మైలవరం తహసీల్దార్ ముత్యాల శ్రీనివాస్, మండల విద్యాశాఖాధికారి రత్న శ్యాoబాబు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News