-జాయింట్ కలెక్టర్ నూపుర్ అజయ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ, జాతీయ రహదారుల భూ సేకరణ పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ నూపుర్ అజయ్ ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న సాధారణ మరియు జాతీయ రహదారులకు సంబంధిచి భూ సేకరణ పనులపై శుక్రవారం స్థానిక కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ నూపుర్ అజయ్, విజయవాడ సబ్ కలెక్టర్ అదితి సింగ్ తో కలిసి రెవిన్యూ భూ సేకరణ అధికారులు, జాతీయ రహదారి అధికారులు, ఆర్ అండ్ బి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నందిగామ జాతీయ రహదారి పనులు, కంచికచర్ల మండలం కంచికచర్ల, పరిటాల భూ సేకరణ పనులలో భాగంగా అవార్డ్స్ ఆమోదం త్వరితగతిన పూర్తిచేయాలని కంచికచర్ల జాతీయ రహదారి భూ సేకరణ పనులు ఒక వారంలో పూర్తిచేయాలన్నారు . జగ్గయ్యపేట మండలం జయంతి పురం గ్రామంలో ఇన్లాండ్ వాటర్ వేవ్స్ టెర్మినల్ ప్రాజెక్ట్ కు సంబంధించి భూస్వాములకు నష్టపరిహారాన్ని అందజేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. గుణదల రైల్వే డబ్లింగ్ కు సంబంధించి భూ సేకరణలో మార్కెట్ విలువల ప్రతిపాదనలు వెంటనే పంపాలని విజయవాడ నార్త్ తహశీల్ధార్ కు ఆదేశించారు. గొల్లపూడి అర్వోఆర్ ప్రాజెక్ట్ భూ సేకరణకు సంబంధించి అభ్యంతరాలపై వ్యాఖ్యల నివేదికను వెంటనే సమర్పించాలన్నారు. ఇబ్రహీంపట్నం నందు పవిత్ర సంగమంనకు సంబంధించి ఆర్ అండ్ బి అధికారులను అభ్యర్ధనలు నివేదిక పంపాలని ఆదేశించారు.
సమావేశంలో తిరువూరు ఆర్డీవో ప్రసన్నలక్ష్మి, నందిగామ ఆర్డీవో రవీంద్రరావు, ల్యాండ్ సర్వే ఏడి కె. సూర్యారావు, తహశీల్ధార్లు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News