Breaking News

లేపాక్షి థీమేటిక్ ఎగ్జిబిషన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపమైన హస్తకళలను ఆదరించి హస్తకళాకారులను ప్రోత్సహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లేపాక్షి థీమేటిక్ ఎగ్జిబిషన్ ను శుక్రవారం జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ ప్రారంభించి ప్రదర్శన తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రాచీన హస్త కళలు మన సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనమన్నారు. ఏంతో మంది కళాకారులు వారి కళానైపుణ్యంతో వినియోగదారులను ఆకర్షించే రీతిలో రూపొందించిన ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచడం అభినందనీయమన్నారు. హస్త కళలకు లేపాక్షి బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం హస్త కళాకారులను ప్రోత్సహించేందుకు వారు రూపొందించిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించడం తో పాటు వినియోగదారులకు తక్కువ ధరకే ఉత్పత్తులు లభించేలా ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అమ్మకాలు నిర్వహించేలా తెలుగు రాష్ట్రాల నుండి హస్త కళాకారులచే తయారైన చికెన్ ఎంబ్రాయిడరీ, గాజు ఆభరణాలు, ప్రింటింగ్ వస్త్రాలు, మధుబని పెయింటింగ్స్, చిత్ర పటాలు, లక్క గాజులు, బాతిక్ పెయింటింగ్, కలంకారి ప్రింటింగ్ మరియు పెయింటింగ్ లు లేసు అల్లికలు, ఏటి కొప్పాక కొండపల్లి బొమ్మలు, చెక్కతో తయారైన అనేక రకాల కళాకృతులు, టెర్రకోట పాటరీలు, తివాచీలు, కేను వస్తువులు, మంగళగిరి, చీరాల నేత వస్త్రాలు డ్రెస్ మెటీరియల్స్, బ్లాక్ మెటల్ వస్తువులు, నిర్మల్ పెయింటింగ్స్ ప్రదర్శనలో ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తున్నారన్నారు. ఇటీవల నగరంలో నిర్వహించిన లేపాక్షి మెగా ఎగ్జిబిషన్ కు ప్రజల నుండి విశేష స్పందన రావడంతో బాపు మ్యూజియం లో ఈ నెల 12వ తేదీ వరకు లేపాక్షి హస్త కళా ప్రదర్శనను నిర్వహిస్తున్నారని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ కోరారు.
లేపాక్షి మేనేజర్ ఎం. సురేష్ మాట్లాడుతూ బాపు మ్యూజియం నందు నిర్వహించే లేపాక్షి ఎగ్జిబిషన్ ఈ నెల 12వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సెలవు దినాలలో కూడా కొనసాగుతుందన్నారు. వివిధ రూపాలకు చెందిన కళాకారులచే రూపొందించిన హస్తకళలను ఆదరించేందుకు ప్రతి ఒక్కరు ప్రదర్శనను తిలకించి కళాకారులను ప్రోత్సహించాలని కోరారు.
కార్యక్రమంలో హ్యాండీక్రాఫ్ట్స్ సర్వీస్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్. అపర్ణ లక్ష్మి, హెచ్ పి ఓ ఎం. సువర్చల, హస్తకళల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ డి. రమాదేవి, జనరల్ మేనేజర్ సి హెచ్ ఎస్ . నరసింహారావు, మేనేజర్ పి . వాసుదేవరావు, డిప్యూటీ మేనేజర్లు బి.శైలజ, ఎస్ వి యెన్ జె. శ్రీధరాచార్యులు, లేపాక్షి సిబ్బంది పాల్గొన్నారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *