Breaking News

జిల్లాకు కేటాయించిన ఇళ్ళ నిర్మాణాల లక్ష్యాలను నూరు శాతం సాధించడం జరిగిందని, కొత్తగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు

రాజమహేంద్రవరంనేటి పత్రిక ప్రజావార్త :
గురువారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి వెలగపూడి లోని సి ఎస్ కార్యాలయం నుంచి రీ సర్వే పనులు, జాతీయ రహదారులు, హౌసింగ్ లక్ష్యాలు, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఇండ్ల నిర్మాణాలు , పంచాయతీ రాజ్ ఉపాధి హామీ, స్వమిత్వ, అమృత్ సరోవర్, క్లాప్, జగనన్న స్వచ్ఛ సంకల్ప, ఎస్డబ్ల్యుపిసి షేడ్స్, కమ్యూనిటీ టాయ్లేట్స్ తదితర అంశాలపై పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ , ఏపి సీడ్స్ ఎండి శేఖర్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ కె.మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో వెబ్ ల్యాండ్ 2.0 వెర్షన్ కి చెంది 45 గ్రామాల్లో సర్వే కి చెంది 41 గ్రామాల్లో పూర్తి చేసి, 4 గ్రామాల్లో ప్రగతి లో ఉన్నట్లు తెలిపారు. భూ హక్కు పట్టలకు చెంది 32225 జిల్లాకు రాగా, 30690 పంపిణీ చేయడం జరిగిందన్నారు. రీ సర్వే స్టోన్ ప్లాంటేషన్ కి చెంది జిల్లాకు 38887 సరఫరా చెయ్యగా ఇప్పటి వరకు 34126 మేర పనులు పూర్తి చేశామన్నారు. స్పందన కి సంబంధించి 4732 అర్జిల్లో 4484 పరిష్కారం చేశామని, 320 పరిశీలన దశలో ఉన్నట్లు తెలిపారు. హౌసింగ్ కి సంబంధించి గత మూడు వారాల్లో 10284 ఇళ్ళ నిర్మాణాలలో ప్రగతి సాధించడం జరిగిందన్నారు. స్టేజ్ కన్వర్షన్ కోసం 7396 ఇళ్ళ కి గాను 5106 నిర్మాణాలను పూర్తి చేశామని, పెండింగ్ పనులను వొచ్చే వారం లక్ష్యంలో సాధించాల్సిందిగా క్షేత్ర అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లాలకు ఇంటి నిర్మాణ లక్ష్యం 15,366 కాగా నూరుశాతం పై ప్రగతి చూపడం ద్వారా 15384 ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇంకా 3796 ఇళ్ళ నిర్మాణాలు ప్రారంభం కావలసి ఉందని పేర్కొన్నారు. జిల్లాలో 13337 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్స్, 13773 ఇళ్లకు త్రాగునీటి సరఫరా చేస్తున్నట్లు తెలియ చేశారు. భారత ప్రభుత్వం పిఎం అవాస యోజన కింద జిల్లాకు కేటాయించిన 11,300 ఇళ్ళ నిర్మాణాలకు గానూ 10530 ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేసినట్లు కలెక్టర్ వివరించారు.. మిగిలిన 770 లక్ష్యాన్ని సాధించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 27942 ఎస్ హెచ్ జి మహిళలకు గృహ నిర్మాణ రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద 6352 ఇళ్లకు గాను 6349 గ్రౌండింగ్ చేసినట్లు తెలిపారు.జిల్లాలో 184565 ఎకరాల ఈ క్రాప్ నమోదు చేయడం జరిగిందని, ఇందులో 98 శాతం మంది రైతుల వివరాలు ఈ కేవైసి పూర్తి చేసినట్లు తెలిపారు. వైయస్ఆర్ యంత్ర సేవా పథకం కోసం 162 దరఖాస్తులు రాగా 121 సి హెచ్ సి లు 50 శాతం వాటా ధనం చెల్లించడం జరిగిందని, 99 యూనిట్స్ ఏర్పాటు చేసినట్లు తెలియచేశారు. వైయస్ఆర్ చేయూత కింద 8346 లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని, వారిలో 5396 కి మంజూరు ఉత్తర్వులు జారీ చేశామని, 1741 యూనిట్స్ గ్రౌండ్ చెయ్యడం జరిగిందన్నారు.ఉపాధి హామీ పథకం అమలులో ఉపాధి కల్పనలో భాగంగా కనీస వేతనం రూ.272 లు ఉండేలా చర్యలు తీసుకుంటామని మాధవీలత పేర్కొన్నారు. ఈ మేరకు క్షేత్ర స్థాయి అధికారులకు పనులు గుర్తించడం లో భాగంగా కనీసం 90 రోజుల ఉపాధి హామీ ఇవ్వడం ద్వారా ఆయా కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం పని చెయ్యడం జరుగుతుందని అన్నారు. ప్రాధాన్యత భవనాలు, గడప గడపకు మన ప్రభుత్వం, ఇతర పంచాయతీ రాజ్ శాఖ ద్వారా జరుగుతున్న పెండింగ్ పనుల పురోగతిపై సమీక్ష చేసి, ప్రాధాన్యత క్రమంలో పూర్తి చెయ్యడం జరుగుతుందని వివరించారు. నేషనల్ మొబైల్ మేనేజిమేంట్ సిస్టమ్ లో ఎప్పటి కప్పుడు ఉపాధిహామీ పనుల వివరాలు అప్లోడ్ చెయ్యడం పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలియచేశారు.

Check Also

సమర్థవంతమైన నాయకత్వంతో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది…

-సాటిలైట్ సిటీ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న గోరంట్ల… -పిడింగొయ్యి గ్రామంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *