Breaking News

రూ.60 లక్షలతో దండి మార్చ్ విగ్రహాలను ఆవిష్కరించిన ..

-నగరంలో రూ 110 లక్షలతో జంక్షన్,
-రూ.83 లక్షలతో డ్రైన్ నిర్మాణం పనులు చేపట్టాం..
-కలెక్టరు డా. కే. మాధవీలత,
-యంపీ. మార్గాని భరత్ రామ్
రాజమహేంద్రవరంనేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి నదీ ఒడ్డున ఉన్న రాజమహేంద్రవరాన్ని మంచి గ్లోబల్ సీటీగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించేందుకు గత సంవత్సర కాలంగా నగరంలో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత, యంపీ. మార్గాని భరత్ రామ్ లు పేర్కొన్నారు.గురువారం రాత్రి స్థానిక కంభాల చెరువు సమీపంలో గల కంబాలచెరువు వివేకానంద సెంటర్ నందు దండి మార్చ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత, యంపీ. మార్గాని భరత్ రామ్, మున్సిపల్ కమీషనర్ తో కలసి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ జిల్లా ప్రధాన కార్యస్థానం కు తగిన విధంగా గుర్తింపు తీసుకుని రావాలనే సంకల్పం తో గత ఏడాది ఏప్రిల్ 4 నుంచి అడుగులు వేయడం జరిగిందని అదిశలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అన్నారు. నగరాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తే ప్రజలకు సౌకర్యం కలుగుతుందో ఆలోచించి పార్లమెంట్ సభ్యులు భరత్ రామ్, కమిషనర్ దినేష్ కుమార్ లతో కలిసి ప్రణాళిక అమలు చేయడం జరిగిందన్నారు. సుదీర్ఘ గోదావరి తీరం గల నగరాన్ని అభివృద్ధి చేసే విధానం లో ఎన్నో పనులు చేపట్టి నగరాన్ని ఎండ్ టూ ఎండ్ గా అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందన్నారు. ప్రజా ప్రతినిదులు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. జుంక్షన్, కంబాల చెరువు, తదితర ప్రాంతాల్లో చేపట్టిన పనులే నిదర్శనం అన్నారు. ఉప్పు సత్యాగ్రహం స్ఫూర్తి పొందేలా ఏప్రిల్ 6 న ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం మరుపురాని ఘట్టం గా కలెక్టర్ అభివర్ణించారు.సుమారు రూ.60 లక్షలతో దండి మార్చ్ విగ్రహాలలో గాంధీజీ 100 అడుగులు విగ్రహం నుంచి దండి సత్యాగ్రహం లో 9 అడుగుల ఎత్తు వరకు 11 విగ్రహాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నగరంలో రూ 110 లక్షలతో జంక్షన్, రూ.83 లక్షలతో డ్రైన్ నిర్మాణం పనులు చేపట్టామన్నారు.ఎంపి మార్గని భరత్ రామ్ మాట్లాడుతూ న్యూ ఢిల్లీ లో తేరా మూర్తి మార్గ్ తర్వాత మన రాజమహేంద్రవరం లో దండి మార్చ్ విగ్రహాలు ఏర్పాటు చెయ్యడం జరిగిందని పేర్కొన్నారు. నేడు యువత దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడంలో దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. మార్చి 12 న ప్రారంభం అయిన ఉప్పు సత్యాగ్రహం యాత్ర దండి లో ఏప్రిల్ 6 న ముగిసిన నేపథ్యం లో అదే స్పూర్తితో కలెక్టర్, కమిషనర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టి నెలరోజుల వ్యవధిలో పూర్తి చేశామన్నారు. ఢిల్లీకి తలపించే విధంగా దండి మార్చ్ విగ్రహాల ప్రతిమలను ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.దేశ స్వాతంత్ర్య సమరంలో దండి మార్చ్ కి ప్రత్యేక స్థానం ఉందని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ అన్నారు. ఆ చారిత్రక నేపథ్యాన్ని భవిష్యత్తు తరాలకు అందించటానికి సాంస్కృతిక నగరం రాజమహేంద్రవరంలో ఈ విగ్రహాలు ఏర్పాటు చేశామన్నారు. స్థానికంగా ఉండే కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఇక్కడే ఈ విగ్రహాలు తయారు చేసినట్లు తెలిపారు. దండి మార్చ్ స్పూర్తితో నగరంలో చేస్తున్న అభివృద్ధి పనులుకు ప్రజలు సహకారం అందించాలని కోరారు. ముఖ్యమంత్రి వారి సహకారంతో నగరంలో రూ.300 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు దినేష్ కుమార్ తెలిపారు. కలెక్టర్, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం, తోడ్పాటు తో అత్యంత సుందర నగరం గా తీర్చిదిద్దడం దిశగా అడుగులు వేయడం జరుగుతోందనీ అన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ కె. దినేష్ కుమార్, రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిలా రెడ్డి, ఏస్ఈ పాండురంగారావు, డిప్యూటీ కమీషనర్, స్థానిక నాయకులు అడపా హరి, నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *