-గృహ నిర్మాణ స్టేజి పురోగతిపై రోజువారీగా సమీక్షించుకుని లక్ష్యాలను అందిపుచ్చుకోవాలి
-గృహ నిర్మాణ లక్ష్యాలపై అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవు
-హౌసింగ్ లేఅవుట్ లలో విద్యుత్తు, డ్రైనేజ్, త్రాగు నీటి సౌకర్యాల వంటి మౌలిక వసతులు సత్వరమే కల్పించాలి: జిల్లా కలెక్టర్
శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో పురోగతిపై డివిజన్ స్థాయి సమావేశంలో భాగంగా శ్రీకాళహస్తీ డివిజన్ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ లో వివిధ దశలలో ఉన్న ఇళ్ళ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని, సామూహిక గృహ ప్రవేశాలకు లక్ష్యాల మేరకు సకాలంలో అందిపుచ్చుకోవాలి అని, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులతో అన్నారు.
ఈ సందర్భంగా బుధవారం ఉదయం శ్రీకాళహస్తి లోని విస్తరణ శిక్షణ కేంద్రంలో డివిజన్ లోని తాసిల్దార్లు, ఎంపిడిఓ లు, హౌసింగ్ అధికారులు,RWS, విద్యుత్తు, డి ఆర్ డి ఎ, మెప్మా తదితర సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమం నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో మంజూరైన 16596 గృహాలలో వివిధ దశలలో ఉన్న ఇళ్ళ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని, సామూహిక గృహ ప్రవేశాలకు వాటిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఇంతవరకు 5140 పూర్తి అయినవాటితో పాటు రూఫ్ స్థాయిలో ఉన్న 2159 మరియు 1250 పై కప్పు స్థాయిలో ఉన్న వాటిని పూర్తి చేసేలా ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమీక్ష ముఖ్య లక్ష్యం క్షేత్ర స్థాయిలో గృహ నిర్మాణం లో అధికారులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకుని వాటికి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం అని అన్నారు.
రేణిగుంట మండలంలో అంకమ నాయుడు మిట్ట, అడుసుపాలెం, కురకాల్వ, ఏర్పేడు మండలం లోని ఉరుందూరు, వికృతమాల లేఔట్ లలో, తొట్టంబేడు లేఔట్, శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి అర్బన్, కేవీబీ పురం, తదితర లేఔట్ లలో బిబీల్ పునాది స్థాయిలలో ఉన్న గృహ నిర్మాణాలను స్టేజి కన్వర్షన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని పురోగతి చూయించాలనీ లేఔట్ ఇంఛార్జి లను ఆదేశించారు. అలాగే లబ్ధిదారుల స్వంత స్థలంలో ఇంటి నిర్మాణం పురోగతి వేగవంతం చేసి పురోగతి చూయించాలని ఆదేశించారు. ఇంటి నిర్మాణ మెటీరియల్ తీసుకుని ఇంకా ప్రారంభించకుండా లేదా స్టేజి కన్వర్షన్ లేకుండా ఉన్నటువటుంటి లబ్ధిదారులను సంబంధిత ఇంజినీరింగ్ అసిస్టెంట్ లు ఉదయమే వెళ్లి మోటివెట్ చేసి తప్పనిసరిగా పురోగతి ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అయినప్పటికీ ఇంటి నిర్మాణంలో స్టేజి పురోగతికి ఆసక్తి చూపని లబ్ధిదారులు సత్వరమే ప్రారంభించే విధంగా ఉండాలని, లేనిచో వారి నుండి ప్రభుత్వం నుండి వెచ్చించిన నిధులను తిరిగి కట్టాల్సి ఉంటుందని, పేద ప్రజలకు కేటాయించిన ఇళ్ళ నిర్మాణాలలో అలసత్వం సహించేది లేదని హెచ్చరించారు.
అధికారులు తగినన్ని ఇటుకలు, సిమెంట్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. డిబిటి అప్రూవల్ లో సమస్య ఉన్నచో పి ఎఫ్ ఎం ఎస్ కోడ్స్ ఇంకా జెనరేట్ కాలేని పక్షంలో లబ్ధిదారుల ఆధార్ ను వారి బ్యాంకు ఖాతాతో అనుసంధానం అయినవి ఇంజినీరింగ్ అసిస్టెంట్ అప్రూవ్ అయ్యాక, ఏఈ లాగిన్ లో అప్రూవ్ చేయాలని అనంతరం హెడ్ ఆఫీస్ నుండి అప్రూవల్ వస్తుందని గృహ నిర్మాణ శాఖ పిడి వెంకటేశ్వర్లు అధికారులకు వివరించారు.
ఇసుక, మెటల్ సంబంధిత అంశాలలో అవక తవకలు పాల్పడితే సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఎక్కడ కూడా త్రాగునీటి కనెక్షన్లు లేవని పూర్తి అయిన ఇంటి వారి నుండి ఫిర్యాదు ఉండకూడదు అని దానికి తగినట్టుగా ఎప్పటికప్పుడు పూర్తి అయిన ఇళ్లకు సత్వరమే త్రాగు నీటి సౌకర్య కల్పన RWS అధికారులు చేయాలి అని అన్నారు.
అలాగే విద్యుత్తు కనెక్షన్లు పెండింగ్ లేకుండా ఎలక్ట్రిసిటీ వారు కరెంట్ కనెక్షన్లు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు అందరు సమన్వయంతో పని చేసి, క్షేత్ర స్థాయిలో వెళ్లి గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు.
అలాగే ఇల్లు కట్టుకొనేందుకు పునాది స్థాయి పూర్తి అయిన వారికి లోన్ కావాలని కోరే లబ్దిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థిక సహకారం డి ఆర్ డి ఏ, మెప్మ అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
లే అవుట్ లో త్రాగు నీటి కనెక్షన్ల ఏర్పాటుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పెద్ద లేఅవుట్ లు ఉన్నచోట కేటగిరీ 3 కింద కాంట్రాక్టర్లచే ఇళ్ళ నిర్మాణాలను వేగవంతంగా సకాలంలో నిర్మించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నియోజక వర్గంలో 14 ఆర్చి ల ఏర్పాటుకు అనుమతులు వచ్చిన నేపథ్యంలో ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులు లేఔట్ ల ఎంట్రెన్స్ లో ఆర్చ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రోజు వారీ లక్ష్యాలను సమాంతరంగా చేపట్టి లక్ష్యాలను అందిపుచ్చుకోవాలి అని తెలిపారు. గృహ ప్రవేశాలకు నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించి ఇంక ఎక్కువ చేసేలా పని తీరు ఉండాలని అన్నారు. గృహ నిర్మాణం లో వెనుకబడిన మండలాలను, లేఔట్ వారీగా ప్రతి వారం ఆర్డీవో సమీక్షించి పురోగతి చూయించాలని తెలిపారు. అధికారులు మనసు పెట్టి పని చేస్తే తప్పకుండా పురోగతి కనిపిస్తుంది అని అన్నారు. రోజువారీ స్టేజి కన్వర్షన్ 600 ఉండేలా పని తీరు మెరుగు పడాలని అన్నారు. వేజ్ కంపోనెంట్ కవర్ అయ్యేలా ఉండాలని, సోక్ పిట్లు ఏర్పాటు ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులు చేపట్టాలని, పెండింగ్ ఓటిఎస్ పత్రాలపై చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ రామారావు, గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు వెంకటేశ్వర్లు, శ్రీకాళహస్తి డి ఈ మరియు ఈఈ ఇంఛార్జి హౌసింగ్ శేషగిరి, సత్యవేడు హౌసింగ్ డిఇ శ్రీనివాసరావు శ్రీకాళహస్తి డి ఎల్ డి ఓ శేషారెడ్డి ఆర్ డబ్ల్యుఎస్ డిఈ శంకర్ రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు, డివిజన్లోని తాసిల్దారులు, ఎంపీడీవోలు డిఆర్డిఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు