ప్రతి వినతిని పరిష్కారం అయ్యేంతవరకూ ట్రాక్‌ చేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిబద్దతతో కూడిన పని తీరు చూపడం పై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న కి చెబుదాం కార్యక్రమం పై ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చెయ్యగా, స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిష్కారం చూపడం జరుగుతోందని అన్నారు. అయినా కొన్ని సందర్భాల్లో ప్రజలు పరిష్కారం పట్ల సంతృప్తి వ్యక్తం చెయ్యక పోవడం తో మరింత జవాబు దారి తనం చూపే దిశలో జె కె సి కార్యక్రమానికి శ్రీకారం చేస్తున్నట్లు తెలియ చేశారని ఆమె అన్నారు.
జిల్లాలో పనిచేసే ప్రతి జిల్లా అధికారి, ప్రతి వినతిని పరిష్కారం అయ్యేంతవరకూ ట్రాక్‌ చేయాలని సిఎం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పేర్కొన్నట్లు తెలిపారు. ప్రజల నుంచి అందిన అర్జీలపై ప్రతి వారం కూడా ఆడిట్‌ చేయాలన్నారు. వీటిపై ప్రతి వారం కూడా నివేదికలు తీసుకోవడం జరుగుతుందని మాధవీలత తెలిపారు. . ట్రాకింగ్, పర్యవేక్షణ జరుగుతుందా? లేదా? అన్నదానిపై ప్రతివారం కూడా సమీక్ష చేస్తామని, స్పందన కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా సేవా విధానం చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లా, డివిజన్, మండల, మునిసిపల్, గ్రామ, వార్డు వరకు ప్రతి ఒక్కరూ బాధ్యత తో కూడి సమస్యల పరిష్కారం కోసం నిబద్దత కలిగి ఉండాలన్నారు. గతంలో ఎన్నుడూ లేని విధంగా ప్రజలకు సత్వర సేవలు అందించే సామర్థ్యం కలిగి మానవ వనరుల అభివృద్ధి చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజా సమస్య లను అత్యంత ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో పరిష్కారం, ప్రజల సంతృప్తి పరచడం ద్వారా అధికారుల, సిబ్బంది పనీ తీరు ఉండాలని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ టి ఈ ఎం రాజు, జిల్లా పంచాయతీ అధికారి పి. జగదాంబ, కలెక్టరేట్ సాంకేతిక సహాయకులు సతీష్ , సూపరింటెడెంట్ ఎమ్. మెరికమ్మ లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *