రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పంట కోత ప్రయోగాల లక్ష్యాలను సాధ్యమైనంత తొందరగా పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం రాత్రి స్థానిక కలెక్టర్ విడిది కార్యాలయం నుంచి జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు తో కలిసి మండల అధికారులతో సి సి ప్రయోగాల పని తీరుపై కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రైతుకు గిట్టుబాటు ధర లభించే విధానంలో రబీ సీజన్ లో ధాన్యం సేకరణ కోసం క్రాప్ కటింగ్ ప్రయోగం ఎంతో కీలకం కానున్నదని పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని 18 మండలాలు పరిధిలో మొత్తం సిసి ఎక్స్పెర్మెంట్ లు 752 గా లక్ష్యం నిర్దేశించామన్నారు. ఇప్పటి వరకు 214 లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు. ఆ ప్రయోగాల ద్వారా ఒక ఈల్డ్ లో సగటు దిగుబడి 21.890 కేజీలు గా సగటు ఎకరాకి 47.266 బస్తాల (75 కేజీల బస్తా) దిగుబడి వస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు చేసిన క్రాప్ కటింగ్ ప్రయోగం ద్వారా హెక్టర్ పంట భూమిలో సగటున 8,756 కేజీల దిగుబడి సాధించడం జరిగిందన్నారు .
Prajavartha Online Telugu News