తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం తిరుపతి నందు (నేటి నుండి అనగా) మే 8, 2023 సోమవారం నుండి ఉచిత వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని విద్యార్థులు పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయ అధికారి సూర్య నారాయణ మూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమము 40 రోజులపాటు మే 8, 2023 నుండి జూన్ 11,2023 వరకు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని అందులో నిర్వహించే కార్యక్రమాల వివరాలు తెలిపారు.
ఉదయం 8 గంటల నుండి 8:30 గంటల వరకు కథలు వినడం.
8.30 గంటల నుండి 10 గంటల వరకు నచ్చిన పుస్తకాలు చదవడం వుయ్ లవ్ రీడింగ్ (పుస్తక పఠనాన్ని ప్రేమించడం) కార్యక్రమాలు నిర్వహించడం.
10 గంటలనుండి 10.10 నిమిషముల వరకు విరామం 10.10 నిమిషముల నుండి పదిన్నర గంటల వరకు కథలు చెప్పడం మరియు చెప్పిన మరియు వినిన కథలపై విషయ విశ్లేషణ కార్యక్రమం.
10:30 గంటల నుండి 11 గంటల వరకు కథలు చెప్పడం 11 గంటల నుండి 12 గంటల వరకు స్పోకెన్ ఇంగ్లీష్/ చిత్రలేఖనం /పెయింటింగ్ /తదితర పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఇలాంటి మంచి సదవకాశాన్ని బడికెళ్లే పిల్లలు ఈ వేసవి సెలవులలో సద్వినియోగం చేసుకోవాలని మరిన్ని వివరాలకు 9000237312 /
8317651455 నంబర్లను సంప్రదించగలరని
గ్రంథాలయ అధికారి, తిరుపతి వారు ఆ ప్రకటనలో తెలిపారు.