Breaking News

వేసవి విజ్ఞాన శిబిరాల గోడపత్రిక మరియు కరపత్రాలు విడుదల చేసిన ఎమ్మెల్యే భూమన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
8మే2023 నుండి 11జూన్2023 వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో జరగబోవు వేసవి శిక్షణ శిబిరాల గోడ పత్రికలను మరియు కరపత్రాలను తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీమతి నైనార్ మధుబాలతో కలిసి విడుదల చేశారు. ఆదివారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గోడపత్రిక మరియు కరపత్రాలు విడుదల అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఉచిత వేసవి విజ్ఞాన శిబిరాన్ని ప్రతి ఒక్క విద్యార్థి వినియోగించుకోవాలని తల్లితండ్రులు తమ పిల్లల్ని ఈ శిబిరానికి పంపి వారు మంచి విజ్ఞానాన్ని సముపార్జించెందుకు సహాయపడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి N S లావణ్య, గ్రంథాలయ అధికారులు J శివప్రసాద్, M ధనంజయలు గురుప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *