Breaking News

తిరుపతి జిల్లాలోని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల అఫిలియేషన్, గుర్తింపు కొరకు తనిఖీలు సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రైవేటు అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల అఫిలియేషన్, గుర్తింపు కాల పరిమితి పొడిగింపు కొరకు 2023-24 సంవత్సరానికి గాను ఈ నెల 31 లోపు పూర్తి స్థాయిలో తనిఖీ చేసి నివేదికలు రాష్ట్రస్థాయి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారికి ఈ మే నెల 31 లోపు పంపేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె వెంకటరమణ రెడ్డి ఆదేశించారు.

మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు ఏర్పాటుచేసిన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ చైర్మన్ హోదాలో మాట్లాడుతూ జిల్లాలోని 40 ప్రైవేటు అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల అఫిలియేషన్, గుర్తింపు, కాల పరిమితి పొడిగింపు కొరకు 2023-24 సంవత్సరానికి గాను ఈ నెల 31 లోపు పూర్తి స్థాయిలో తనిఖీ చేసి నివేదికలు రాష్ట్ర స్థాయి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారికి పంపేలా ఆర్ఐఓ, డివిఈఓ సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రభుత్వం నుండి అందిన మొబైల్ యాప్ లో చెక్ లిస్ట్ మేరకు వివిధ శాఖలకు సంబంధించిన అంశాలు కళాశాలలో ఉండాల్సిన మౌలిక సదుపాయాలు, అనుమతి పత్రాలు నిబంధనల మేరకు ఉన్నాయా లేదా అని పరిశీలించి పారదర్శకంగా నివేదికలు తయారు కావాలని ఆదేశించారు. మున్సిపల్ శాఖ, ఆర్ అండ్ బి, ఫైర్ డిపార్ట్మెంట్, పంచాయతీ, మున్సిపల్ అధికారులు తదితర శాఖల నుండి సకాలంలో సంబంధిత రిపోర్టులు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆర్ఐఓ, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, జూనియర్ కాలేజ్ లెక్చరర్ లతో కూడిన త్రిసభ్య కమిటీ తో 20 జూనియర్ కళాశాలలు, రెండవ త్రిసభ్య కమిటీ డివిఈవో, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్, జూనియర్ లెక్చరర్ లతో మొత్తంగా రెండు త్రిసభ్య కమిటీలు సమన్వయంతో జిల్లాలోని 40 ప్రైవేటు అన్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీ లను పరిశీలించి నిబంధనల మేరకు ఉన్నాయా లేదా అని వాటిని తనిఖీ చేసి నివేదికను జిల్లా స్థాయి కమిటీకి సమర్పించాలని ఆదేశించారు.

జిల్లా ఎస్పీ వైస్ చైర్మన్ హోదాలో మాట్లాడుతూ జూనియర్ కళాశాలలను తనిఖీ చేసి నిబంధనల మేరకు వసతులు ఉన్నాయో లేదో పారదర్శకంగా నివేదిక ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆర్ఐఓ కమిటీకి వివరిస్తూ జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, జిల్లా ఎస్పీ వైస్ చైర్మన్ గా,జిల్లా అగ్నిమాపక అధికారి, మున్సిపల్ కమిషనర్, డిపిఓ సభ్యులుగా ఉంటారని, రీజనల్ ఇన్స్పెక్షన్ అధికారి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మెంబర్ కన్వీనర్ గా మొత్తం వెరసి ఆరుగురితో జిల్లా స్థాయి కమిటీ జీవో ఎంఎస్ నెంబర్ 192 పాఠశాల విద్య తేదీ 21.12.2022 మేరకు జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు కులశేఖర్, వెంకట్రావు డిపిఓ రాజశేఖర్ రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య, మున్సిపల్ కమిషనర్ తిరుపతి నగరపాలక సంస్థ సునీత, తదితర అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *