విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్,కృష్ణా నగర్ చైతన్య స్కూల్ క్యాంపస్ లో దేవినేని నెహ్రూ చారిటిబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు,ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు కొరివి చైతన్య,వైస్సార్సీపీ నగర అధ్యక్షులు బొప్పన భవకుమార్,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,12వ డివిజన్ ఇంచార్జ్ మాగంటి నవీన్,డివిజన్ అధ్యక్షులు రిజ్వాన్, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల వైద్య విభాగం ఇసిన్హార్గ్ డా.మెహబూబ్,14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబాయ్య పాల్గొన్నారు.
ప్రజల ఆర్యోగం కోసమే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు తెలిపారు. మంగళవారం 12వ డివిజన్ ప్రజలు కోసం దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చి నట్లు ఆయన వివరించారు. ప్రజలందరు వివిధ రకలైన వ్యాధులతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఉచితంగా ప్రతి ఒక్కరికి బీపీ, షూగర్, ఈసీజీ, గుండె సబంధిత పరీక్షలు అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందజేశామని చెప్పారు. వేయి మందికి పరీక్షలు అందించడంతో పాటు అవసరమైన అన్ని పరీక్షలు ఉచితంగా చేశామని వివరించారు.ప్రజలకు ప్రతి ఏడాది తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ అవినాష్ ఆయన సొంత నిధులు నుండి ఉచిత క్యాంపు ఏర్పాటు చేసి ఆరోగ్య నియోజకవర్గం గా తయారు చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దుర్గగుడి పాలకమండలి మెంబెర్ బచ్చు మాధవి,13వ డివిజన్ ఇంచార్జ్ రామయణపు శ్రీనివాస్,మహిళ నాయకులు ధనికుల ఇందిర మరియు డివిజన్ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News