
-శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ను దర్శించుకు శ్రీశ్రీశ్రీ దత్త పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి
-శ్రీ తాతయ్య గుంట నేరేళ్ళమ్మ రాజేశ్వరి అమ్మ వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వడిబాల ఉత్సవంతో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర ప్రారంభం అయ్యిందని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. వైశాఖమాసం, శుక్లపక్షం చవితి రోజు మంగళవారం ఉదయం శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయం నందు గంగమ్మ విశ్వరూప స్తంభానికి అత్యంత వైభవంగా అభిషేకం నిర్వహించడంతోపాటు 32 రకాల వస్త్రధారణ, పూలమాలలతో స్తంభాన్ని అలంకరించి, వడిబాల (సుమంగళ సౌభాగ్యం సుగంధ ద్రవ్యాలు బియ్యం వడిబాల గా కట్టి) విశ్వరూప స్తంభానికి కట్టడం జరిగిందని, వడిబాల కట్టడం తో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర ప్రారంభమైందని తెలిపారు. అనంతరం తాతయ్య గుంట నేరేళ్ళమ్మ రాజేశ్వరి అమ్మ వారి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకొని ఆలయం నందు భక్తులకు అంబలిని అందచేశారు.
శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయం చేరుకున్న శ్రీశ్రీశ్రీ దత్తా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారికి ఎమ్మెల్యే,మేయర్ డాక్టర్ శిరీష ఆలయ చైర్మన్ కె.గోపి యాదవ్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ హరిత, ఆలయ ఈఓ మునికృష్టయ్య స్వాగతం పలికారు.
అనంతరం శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గర్భాలయంలో అమ్మవారి ప్రత్యేక పూజలు చేసి మంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా స్వామి వారు మాట్లాడుతూ శ్రీతాతయ్య గుంట గంగమ్మ కు సంబంధించి 1400 సం. లు లేదా రెండు వేల సంవత్సరాలు అని కొలమానం లేదని, కలియుగములో శ్రీ మహావిష్ణువు తిరుమల కొండపై స్వయంభువుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలసియున్నారో అప్పటినుండి తిరుపతిలో గంగమ్మతల్లి ఉందన్నారు. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయాన చెల్లెలైన గంగమ్మ తల్లి తిరుపతిలో ఉండడం తిరుపతి ప్రజల అదృష్టం అన్నారు. తిరుపతి పట్టణంలో గంగమ్మ వైభవానికి సంబంధించి వారం రోజులు పాటు ఉపన్యాసం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈరోజు గంగమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ కె. గోపి యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత సంవత్సరం గంగమ్మ ఆలయంలో అడుగుపెట్టినప్పటి నుండి ఆలయ అభివృద్ధి పనులు వేగంగా జరిగాయని, గంగ జాతరను రాష్ట్ర పండుగ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కి తిరుపతి పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. గంగమ్మ జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. సుమారు గంగ జాతరకు లక్ష మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి గంగమ్మ దర్శనానికి రావడం జరుగుతుందని, ఏ ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించడం జరిగింది అన్నారు.
ఇప్పటికే నగరంలో వీధులను వెడల్పు చేయడం జరిగిందని, పొంగల్ నైవేద్యం తెచ్చే భక్తులకు ఇందిరా మైదానంలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఎప్పటికప్పుడు శుభ్రపరుచుట కోసం మున్సిపాలిటీ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని అన్ని శాఖల సహకారంతో ఈ సంవత్సరం గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో ముని కృష్ణయ్య మాట్లాడుతూ ఈ తొమ్మిది రోజుల పాటు గంగమ్మ తల్లి ఉత్సవాలలో భాగంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా గట్టి పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ,ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు టి. వెంకటేశ్వరరావు, యం. హరినాథ్ రెడ్డి, టి. రమణమ్మ, పి. ధన శేఖర్, వి. కృష్ణమ్మ, వి. గీత, యన్. భారతి ఆలయ అర్చకులు మరియు సిబ్బంది సమాచార పౌర సంబంధాల శాఖ ఏపీఓ పి.వెంకట్రమణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News