Breaking News

అర్హులైన ప్రతి ఒక్కరిని జల్లెడ పట్టి మరీ గుర్తించి సంక్షేమ పథకాలను అందిస్తున్నాం..

-ఇప్పటివరకు 99 శాతం మంది కి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించాం.
– జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.
-హోం మంత్రి డా.తానేటి వనిత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని జల్లెడ పట్టి మరీ గుర్తించి సంక్షేమ పథకాలను, ధ్రువపత్రాలు అందచెయ్యడం జరుగుతోందని రాష్ట్ర హోం మంత్రి డా తానేటి వనిత పేర్కొన్నారు.శనివారం స్థానిక వాంబే కాలనీ, నారాయణ పురం నందు జరిగిన 1,4,5 సచివాలయ పరిధిలో జగనన్న సురక్ష గ్రామ సభ అత్యంత ఘనంగా నిర్వహించారు. మునిసిపల్ కమిషనర్ కే. దినేష్ కుమార్ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన తో హోం మంత్రి, ఎంపి, కలెక్టర్, రూడా చైర్ పర్సన్ తదితరులు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమం చివరిలో అర్జి దారులకు ధృవ పత్రాలను అందచేశారు.ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర హోం మంత్రి డా తానేటి వనిత మాట్లాడుతూ మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తొలి రోజు నుంచి ప్రజలకు ఏవిధంగా సంక్షేమ పాలన అందిచాలో ఆలోచన చెయ్యడం జరిగిందన్నారు. ఆదిశలో 99 శాతం మంది కి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించమన్నారు. కొన్ని సాంకేతిక పరమైన అంశాలు వలన పథకాలు అందని ఒక శాతం వారిని గుర్తించి ఆ పథకాలు, సర్టిఫికెట్స్ అందించే ప్రయత్నం జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అమలు చేస్తున్నామన్నారు. జనన, మరణ, వివాహ, కుల, ఆదాయ ధ్రువీకరణ వంటి 11 రకాల ప్రభుత్వ సేవల యొక్క పత్రాలు అందజేసే బృహత్తర కార్యక్రమం అన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా కుల మత రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవానికి సంక్షేమ పథకాల యొక్క ప్రయోజనాలను నేరుగా ఆ ఇంటి వద్దకే వెళ్లి అందిస్తున్నామన్నారు.ఎంపి మార్గాని భరత్ మాట్లాడుతూ, గతంలో సంక్షేమ పథకాలు అమలు కొద్ది మందికే అందేవని, పెన్షన్ కోసం ఎవరైనా చనిపోతే మాత్రమే మరొకరికి వచ్చే అవకాశం ఉండేదన్నారు. నేడు జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత అర్హత ప్రామాణికంగా పథకాలు అమలు చేయడం లక్ష్యం దిశగా అడుగులు వేయడం జరిగిందన్నారు. ఆక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళడం జరిగిందన్నారు.గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి రూ. 2.5 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు.ఈ ప్రభుత్వానికి మీ అండ ఉండాలని కోరారు.జిల్లా కలెక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ, పరిపాలన వికేంద్రీకరణ దిశగా రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకుని రావడం జరిగిందన్నారు. ఒక కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్, అధికార్ల పేర్లు తెలియని వారు ఉన్నా , వాలంటీర్ తెలియని వారు లేరని పేర్కొన్నారు. జిల్లాలో తొలి రోజు జరుగుతున్న జగనన్న సురక్ష 39 గ్రామ సభలు ద్వారా 45 వేల సేవలందించడం జరిగిందన్నారు. ఈ నెల రోజులు పాటు నిర్వహించే 11 రకాల సేవలు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి సచివాలయం ద్వారా 500 ప్రభుత్వ సేవలను ఉచితంగా అందిస్తున్నామన్నారు. గత మూడు ఏళ్లుగా వాలంటరీ సచివాలయ వ్యవస్థ ద్వారా నవరత్నాల పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నారన్నారు.మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం నగరంలోని 96 సచివాలయాల్లో చేపట్టడం జరుగుతోందని అన్నారు. ఆ క్రమంలో తొలి రోజు 8 సచివాలయాల్లో  జగనన్న సురక్ష ప్రారంభించు కోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా 2500 మందికి టోకెన్లు జారీ చేసి సేవలు అందించడం జరిగిందన్నారు.రూడా చైర్ పర్సన్ ఏం. షర్మిలా రెడ్డి అర్హత ఉండి పథకాలు అందని వారికి వారి ఇంటి వద్ద సమస్యలు పరిష్కారం చేసే కార్యక్రమం జగనన్న సురక్ష అని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా జగనన్న సురక్ష, జగనన్నకు, గడపగడపకు మన ప్రభుత్వం వంటి కార్యక్రమాలు ద్వారా సత్వర పరిష్కారం చేస్తున్నట్లు పేర్కొన్నారురూడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి,  గాండ్ల కార్పొరేషన్ చైర్ పర్సన్ సంగీత భవానీ ప్రియ, ఆర్యాపురం బ్యాంకు డైరెక్టర్లు, సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Check Also

యధావిధిగా సెప్టెంబరు 23 సోమవారం “పీజీఆర్ఎస్ ‘మీ కోసం”

-జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *