-ముస్తాబైన బహిరంగ సభా వేదిక . .
-పకడ్భందీగా సభా నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం
-ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, కలెక్టర్, ఎం ఎల్ ఏ
చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు జిల్లా యంత్రాంగం పకడ్భందీగా ఏర్పాట్లను పూర్తి చేసింది. సభా వేదిక, హెలిప్యాడ్ ల వద్ద పటిష్టంగా గ్యాలరీల నిర్వహణ, త్రాగునీటి సదుపాయం తదితర ఏర్పాట్లు, గ్రీన్ రూమ్ తో పాటు బ్యారికేడింగ్ ఇతరత్రా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసారు. బహిరంగ సభ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి, రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్బ గనుల శాఖామాత్యులు డా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్. రెడ్డెప్ప, జెడ్పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనల సమన్వయకర్త తలశీల రఘురాం ఏపి డైరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ ఎండి బాబు అహ్మద్, కలెక్టర్ సగిలి షన్మోహన్, ఎస్ పి వై.రిశాంత్ రెడ్డి, చిత్తూరు శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు, ఏ పి ఎస్ ఆర్ టి సి వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ వి. శ్రీనివాసులు, డి ఆర్ ఓ ఎన్.రాజశేఖర్ లతో కలసి పరిశీలించారు. బహిరంగ సభ వద్ద ఎల్ ఈ డి స్క్రీన్ లు, బ్యారికేడింగ్, పార్కింగ్, సీటింగ్ అరేంజ్మెంట్ లు, సభకు వచ్చే ప్రజలకు త్రాగు నీటి వసతి, స్యానిటేషన్ తదితర సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమం లో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.