Breaking News

అలయన్స్ క్లబ్ ఆఫ్ రమాదేవి క్లబ్ ఆధ్వర్యంలో జల జీవులకు మేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అసోసియేషన్ ఆఫ్ అలియాన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 225s అలయన్స్ క్లబ్ ఆఫ్ రమాదేవి క్లబ్ అధ్యక్షురాలు ఎం శోభారాణి పుట్టినరోజు సందర్భంగా పున్నమి ఘాట్ లోని పవిత్ర కృష్ణా నది లోని జీవరాశులకు ఆహారం వేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిస్టిక్ 225s గవర్నర్ అలై జి వెంకటేష్ , వి డి జి 1 అలై ఎం చిన్నారావు, వి డి జి 3 అలే గుడివాడ కృష్ణ కిషోర్,ఆర్ సి అలై పి లలిత రాణి, క్యాబినెట్ సెక్రటరీ రైల్వే శ్రీనివాస్, హాజరై తొలిత కేక్ కటింగ్ ని నిర్వహించారు అనంతరం విష్ణుమూర్తి అవతారాలలో ఒకటైనా అవతారం మత్స్య అవతారం వాటికి ఆహారాన్ని వేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు కార్యక్రమాన్ని బంధువుల మధ్య నిర్వహించుకుంటుంటే శోభారాణి మాత్రం జీవరాశులకు ఆహారం అందించాలనే ఉద్దేశంతో పున్నమిగాట్లోని ఉన్నటువంటి చేపలు చేపల పిల్లలకు సుమారు 50 కేజీల ఆహారాన్ని వేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు, ప్రతి ఒక్కరు కూడా మచ్చు సంపద పెరగాలంటే ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు, ఈ కార్యక్రమంలో స్టిక్ పి ఆర్ ఓ పి శ్రీనివాసరావు, సెక్రటరీ రాజులపాటి సుబ్రహ్మణ్యం, రాజుపాటి రాజేశ్వరి, అడ్మినిస్ట్రేటర్ వీరంకి శివరామకృష్ణ, రాజ్ కుమార్, మరీదు వెంకటేశ్వరరావు, హరి,తేజ,నీలిమ గాంధీ,భార్గవి, సుహాసిని, గాయత్రి, రితేష్ తదితరులు పాల్గొన్నారు

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *