-అధ్యక్షులు కోలా.అజయ్
-మణిపూర్ మత మారణహోమాన్ని ఖండించిన మన ప్రెస్ క్లబ్ సభ్యులు
-మనప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యాలయం నుండి రింగ్ సెంటర్ వరకు శాంతి ర్యాలీ
-సంఘీభావ మద్దతు తెలిపిన రాజకీయ పార్టీల నేతలు…!!
కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
గత రెండు నెలలు గా మత మారణహోమాన్ని సృష్టిస్తున్న మత ఉగ్రవాదాన్ని అణచివేయాలని డిమాండ్ చేస్తూ మైలవరం జర్నలిస్టులు మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోలా. అజయ్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. మణిపూర్ లో శాంతి నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ ఇబ్రహీంపట్నం మన ప్రెస్ క్లబ్ కార్యాలయం నుండి రింగ్ సెంటర్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ శాంతి ర్యాలీ లొ మణిపూర్ లో మహిళలకు రక్షణ కల్పించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, శాంతి నెలకొల్పాలని నినాదాలు చేశారు. జర్నలిస్టులు నిర్వహించిన శాంతి ర్యాలీకి వైసీపీ, జనసేన, సిపిఎం పార్టీల నేతలు సంఘీభావ మద్దతు ప్రకటించి ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మణిపూర్ లో దావాలంగా వ్యాపించిన మత విద్వేషాలను ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రజా స్వామ్య దేశం లో మహిళల పై జరుగుతున్న పాశవిక దాడులు దేశ ప్రతిష్టకు కళంకం అన్నారు. తక్షణమే మణిపూర్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అధీనం లోకి తీసుకొని మత ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో ప్రేకలించాలని డిమాండ్ చేశారు. మణిపూర్ లో మత విద్వేషాలకు తావు లేకుండా శాంతి నెలకొల్పాలని పిలుపునిచ్చారు.