Breaking News

ఆగస్టు 15 వ తేదీ లోపు కాలువలు, డ్రైన్ల ప్రక్షాళన ఖచ్చితంగా జరగాలి !!

-జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పలు ప్రాంతాల్లోని పంటకాలవలు, డ్రెయిన్లలో గుర్రపు డెక్క తూడు పేరుకుపోయి అధ్వాన్నంగా మారడంతో పాటు సాగు నీటికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని, ఆగస్టు 15 వ తేదీ లోపు కాలువలు, డ్రైన్ల ప్రక్షాళన ఎట్టి పరిస్థితుల్లోనూ జరగాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టర్ ఛాంబర్ లో జల వనరుల శాఖ సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ సాగు నీటి పనులపై సంబందిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తూడు తొలగింపు పనులను జిల్లా మొత్తం ఒకేసారి చేపడితే ఫలితం ఉంటుందన్నారు. అరకోర పనుల వలన ఫలితం లేకపోగా స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు పలు ప్రాంతాల ప్రజల నుండి అందుతున్నాయని తెలిపారు. కాల్వల్లో గుర్రపు డెక్క తొలగించిన కొన్ని రోజులకే మళ్లీ వస్తుందని, కాల్వల్లో నీరు ఉండని సమయంలో గుర్రపు డెక్క, కిక్కిస, తూడు తొలగింపునకు శాశ్వత చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్‌ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. పంట కాల్వల్లో, డ్రెయినేజీల్లో ప్లాస్టిక్‌ వ్యర్ధాలను తొలగించాలని కలెక్టర్‌ ఆదేశించారు. త్రాగునీరు, సాగునీరు, ఆక్వా, పరిశ్రమలు ఒక క్రమంలో నీటి విడుదల జరగాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో త్రాగు, సాగు నీరుకు ఇబ్బంది లేని విధంగా అవసరమైన చోట క్రాస్ బండ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.

కాలువల ప్రక్షాళనకు సంబంధించి జరుగుతున్న పనులపై ఏ రోజుకా రోజు సమాచారాన్ని వాట్సప్ గ్రూపులో పొందుపరచాలని కలెక్టర్ సూచించారు. ఎన్ని పనులు జరిగాయి అనేది ఖచ్చితమైన నివేదిక అందులో తప్పక వివరించాలని ఇరిగేషన్ ఎస్ఈ కు సూచించారు. ట్రూ ప్రజెంటేషన్ ను సింపుల్ స్టేట్మెంట్లు గా అది ఉండాలన్నారు.

ఈ సమావేశంలో విజయవాడ ఇరిగేషన్ సర్కిల్ సూపర్నెంట్ ఇంజనీర్ టి జే ఎం ప్రసాద్ బాబు,డ్రైనేజ్ ఈఇ వై. విజయలక్ష్మి, కృష్ణా సెంట్రల్ డివిజన్ పివిఆర్ కృష్ణారావు, ఇరిగేషన్, డ్రైనేజీ శాఖలకు చెందిన పలువురు డి ఇ లు అధికారులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *