Breaking News

బంగారుకొండ కార్యక్రమం పై టీమ్ తూర్పు గోదావరి కి ప్రధాన కార్యదర్శి ప్రత్యేక ప్రశంస

-జిల్లా ప్రగతి పై కలెక్టర్ల తో ప్రధాన కార్యదర్శి సమీక్ష

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయడంలో లక్ష్యాలను సాధించడానికి అన్ని శాఖలతో సమన్వయం సాధించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత తెలిపారు.శనివారం ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి న్యూఢిల్లీలోని ఏపి భవన్ నుండి ఈ క్రింది అజెండా అంశాలపై స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, ఆరోగ్యం మరియు స్త్రీ & శిశు సంక్షేమం – ప్రభుత్వం, పథకాలు మరియు సూచికలపై, బాల్య వివాహాల నిరోధక చర్యలు, పాఠశాల విద్య, నైపుణ్యాల అభివృద్ధి & శిక్షణ, గ్రామ వార్డు సచివాలయాలు – స్పందన ఫిర్యాదులు. గడప గడపకు మన ప్రభుత్వం , హౌసింగ్ కాలనీల్లో తోరణాల నిర్మాణం, జగనన్నకు చెబుదాం పై సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రయోగత్మకంగా చేపట్టిన బంగారు కొండ కార్యక్రమం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో ప్రత్యేక పోషక ఆహారం సత్ ఫలితాలు ఇవ్వడం పట్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి అభినందించారు. జూన్ నెలలో చేపట్టిన కార్యక్రమం వల్ల 3 నెలల్లో 383 మంది పిల్లలు సాధారణ స్థితికి రావడం అభినందనీయం అన్నారు. కలెక్టర్ మాధవీలత బంగారుకొండ వివరాలు తెలియ చేస్తూ, జూన్ నెలలో ప్రజల భాగస్వామ్యం తో కార్యక్రమం చేపట్టి 1283 మంది పిల్లలను బాలమిత్ర లు ఆరు నెలలు పాటు వారిని సంరక్షణ చేసే విధానం చేపట్టడం జరిగిందన్నారు. 6 నెలల నుంచి 6 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లల్లో బలహీనంగా , రక్తహీనత, సరైన ఎదుగుదల లేని పిల్లలను గుర్తించినట్లు పేర్కొన్నారు . మూడు నెలల్లో 383 మంది పిల్లలు సాధారణ స్థితికి తీసుకుని రావడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో ప్రజా ప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వామ్యం చేయండం జరుగుతుందని అన్నారు. సమావేశంలో భాగంగా జగనన్న కు చెబుదాం కార్యక్రమం కింద ఇప్పటి వరకు 8613 ఫిర్యాదులు అందాయని, అర్హమైనవి వాటిలో 7352 పరిష్కారం చేసినట్లు, మరో 686 పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. గత 15 రోజుల్లో జేకేసి కింద 363 అర్జీలు రాగా 181 పరిష్కారం చేయగా, 167 పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. మార్గదర్శకాల మేరకు 7 రోజుల్లో వాటిని పరిష్కారం చేస్తున్నట్లు తెలిపారు. 5 రీ ఓపెన్ అర్జిల కు సంబందించి అర్జిదారుని కి పెండింగుకు గల కారణం అధికారులు తెలియ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో కొవ్వూరు మండలం కాపవరం హౌసింగ్ జగనన్న కాలనీ లో అర్చి నిర్మాణం పూర్తి చేశామని, సోప్ పిట్స్ పనులు జరుగుతున్నట్లు మాధవీలత వివరించారు.
జగనన్న ఆరోగ్య సురక్ష కింద 82 మెడికల్ క్యాంపులు నిర్వహించి 39,255 మందికి వైద్య సేవలు అందించినట్లు మాధవీలత తెలిపారు. 1878 మందిని తదుపరి వైద్య సేవలకు ఆరోగ్య శ్రీ ఆసుపత్రికి సిఫార్సు చేసినట్లు తెలిపారు. 5048 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, వారిలో 547 మందికి శస్త్ర చికిత్స కోసం సిఫార్స్ చేసినట్లు పేర్కొన్నారు. సగటున 478 మంది వైద్య శిబిరాలకు హాజరవుతున్నట్లు తెలిపారు. బడి 4బయట పిల్లలను స్కూల్ లో జాయిన్ చేసే ప్రక్రియ లో 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించని 7367 మందిలో 6413 మందిని తిరిగి స్కూల్స్ లో జాయిన్ చేసినట్లు తెలియచేశారు. 100 % గ్రాస్ ఎన్రోలమెంట్ కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. బెటి బచావో, బెటి పడావో కింద జిల్లాలో 683 మంది బాలికలను స్కూల్స్ లో జాయిన్ చేశామని తెలిపారు.  జిల్లాలో 8423 మంది గర్భిణీ స్త్రీలలో 5549 మందికి పరీక్షలు నిర్వహించి వారిలో 1003 మంది రక్త హీనత కలవారికి తగిన పోషణ విలువలు కలిగిన ఆహారం అందించడం తో పాటు, వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. జే ఎ ఎస్ కింద ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. బలహీనంగా ఉన్న 3191 మంది పిల్లల్లో 3044 మందికి, తక్కువ బరువు ఉన్న 2142 మందిలో 1894 మందికి సంపూర్ణ పౌషిక ఆహారాన్ని అందించినట్లు తెలిపారు. బంగారు కొండ కార్యక్రమం పై జిల్లా కలెక్టర్ సమీక్ష: అనంతరం ఐసిడీఎస్ అధికారులతో కలెక్టర్ మాధవీలత తో కలిసి జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ సమీక్ష చేస్తూ, బంగారు కొండ కార్యక్రమం లో సర్వే ద్వారా గుర్తించిన మొత్తం 1283 మంది పిల్లల్లో 383 మంది మూడు నెలల్లో సాధారణ స్థితికి రావడం లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అభినందనీయం అన్నారు. కొత్తగా 42 మందిని గుర్తించడం జరిగిందని వారిని కూడా దత్తత తీసుకునే ప్రక్రియ చేపట్టాలని కోరారు.

Check Also

తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్యామలరావు గురించి తెలుసుకుందాం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఒక గొప్ప మెరిట్ స్టూడెంట్ ఆయన, ఎలా అంటే ఎంసెట్ లో 29 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *