Breaking News

జేకేసి, మండల స్థాయి జేకేసి లలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జేకేసి, మండల స్థాయి జేకేసి లలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తూ, కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అర్జీల స్థితి తెలుసుకోవడం జరుగుతున్నట్లు కలెక్టర్ కె. మాధవీలత తెలిపారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి విజయవాడ నుండి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, ఆరోగ్యం మరియు స్త్రీ & శిశు సంక్షేమం – ప్రభుత్వం, పథకాలు మరియు సూచికలపై,  పాఠశాల విద్య,  గ్రామ వార్డు సచివాలయాలు – , జేకేసి,   గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్నకు చెబుదాం పై సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె . మాధవీలత జిల్లా ప్రగతి నివేదిక వివరించారు. జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష కింద 235 మెడికల్ క్యాంపులు నిర్వహించామని , గ్రామీణ ప్రాంతం లో 209, పట్టణ ప్రాంతంలో 26 నిర్వహించి, 1,12,600 మందికి ఔట్ పేషంట్స్ కింద వైద్య సేవలు అందించినట్లు, సగటున ప్రతి క్యాంపులో 401 మంది హాజరై వైద్య సేవలు పొందినట్లు వివరించారు బడి బయట పిల్లలను స్కూల్ లో జాయిన్ చేసే ప్రక్రియ లో 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించని 7367 మందిలో 7072 మందిని తిరిగి స్కూల్స్ లో జాయిన్ చేసినట్లు తెలియచేశారు. ఇంటర్ లో 2221 మందిని తిరిగి కాలేజీల్లో చేర్పించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 100 % గ్రాస్ ఎన్రోలమెంట్ కోసం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జగనన్నకు చెబుదాం మండల స్థాయి లో ఇప్పటి వరకు 684 అర్జీలు రావడం జరిగిందని, వాటిలో 345 పరిష్కారం చేశామని, 333 పరిశీలనలో ఉన్నట్లు, ఆరు మాత్రమే రీ ఓపెన్ అయినట్లు పేర్కొన్నారు. జేకేసి 1902 కు వచ్చిన మొత్తం 9635 అర్జీలలో 8,053 పరిష్కారం చేసినట్లు వివరించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *