Breaking News

జిల్లా కలెక్టర్లతో సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్…

మచిలీపట్నం ,నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్ రెడ్డి శనివారం జిల్లా కలెక్టర్లతో సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వ్యవసాయం, కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులు, పంట రుణాల జారీ, ఈ క్రాప్ బుకింగ్, చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపన, ప్రాధాన్యత భవనాల నిర్మాణ ప్రగతి, స్వామిత్వ, జలజీవన్ మిషన్ ,గృహ నిర్మాణం- జగనన్న కాలనీలలో ఆర్చిల నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించారు. కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు జిల్లా ప్రగతి వివరిస్తూ జిల్లాలో ఇప్పటివరకు 57,889 మంది కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. అర్హులైన కౌలు రైతులకు ఈ ఏడాది 237 కోట్ల రూపాయలు పంట రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ క్రాప్ బుకింగ్ ప్రగతికి సంబంధించి ఈకేవైసీ నూరు శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ (గోడౌన్స్) నిర్మాణ ప్రగతికి సంబంధించి మొదటి దశలో 71 గోడౌన్స్ నిర్మాణ లక్ష్యంతో 61 గ్రౌండ్ చేయగా, 15 పూర్తి చేయగా మరో 10 నిర్మాణ పూర్తయ్య దశలో ఉన్నాయన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణ ప్రగతికి సంబంధించి జిల్లాలో 281 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణ లక్ష్యంతో, ఇప్పటికే 142 గ్రామ సచివాలయ భవన నిర్మాణాలు పూర్తి చేసి అప్పగించడం జరిగిందని, వచ్చే డిసెంబర్ 10 నాటికి నూరు శాతం పూర్తి చేయడం జరుగుతుందన్నారు. 172 ఆర్బికె భవనాల నిర్మాణానికి గాను 90 భవనాలు, 123 వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలకు గాను 39 పూర్తిచేసి అప్పగించినట్లు తెలిపారు. ”స్వామిత్వ” కార్యక్రమం క్రింద 115 గ్రామాల్లో గ్రౌండ్ ట్రోతింగ్ , 47 గ్రామాల్లో గ్రౌండ్ వాలిడేషన్ 14 గ్రామాల్లో 13వ నోటిఫికేషన్ జారీ, 11గ్రామాల్లో ఫైనల్ ఆర్ ఓ ఆర్ జారీ చేసినట్లు తెలిపారు. గృహ నిర్మాణ ప్రగతికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల గృహాల పూర్తి లక్ష్యంతో జిల్లాలో ఇప్పటివరకు నిర్మాణం పూర్తి అయిన 22, 598 గృహాల్లో 20,610 గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ డిఆర్వో పెద్ది రోజా, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

సమర్థవంతమైన నాయకత్వంతో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది…

-సాటిలైట్ సిటీ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న గోరంట్ల… -పిడింగొయ్యి గ్రామంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *