Breaking News

విద్యార్థుల విద్యాభ్యాసం లో భాగం గా 40 సెంటుల స్థలం లో వరి వంగడాల పంట…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మేరీ స్టెల్లా కళాశాల లోని అగ్రికల్చర్ అండ్ రూరల్ డవలప్మెంట్ విభాగం వారు విద్యార్థుల విద్యాభ్యాసం లో భాగం గా 40 సెంటుల స్థలం లో వరి వంగడాలయిన కుజిపటలియా మరియు చిట్టిముత్యలు రకాలను పండించారు. జూన్ నెల లో నారు పోసామని, వ్యవసాయ సాగు నీ జూన్ నెలాఖరు లో ప్రారంభించి విద్యార్థినులు రెండు వంగడాలను పండించారు. సన్న రకం మరియు రతువంటి క్రిమి సంహారక మందులు పెస్టిసైడ్ వాడకుండా పూర్తిగా సేంద్రీయ పద్ధతులలో ఈ రెండు రకాల పంటలు ముఖ్యం గా చిట్టి ముత్యాల రకం ప్రజలు ఇష్టం గ తింటారని Dr లక్ష్మణ స్వామి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ విభాగాధిపతి తెలిపారు. కుజిపతలియా మరియు చిట్టి ముత్యాలు రకం సాగు చేయటం లో విద్యార్థినులు సఫలీకృతం అయ్యారని 10 బస్తాల కి పైగా పంట దిగుబడి వచ్చిందని, ఈ రెండు రకాలు మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఉపయిగించవచ్చునని రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని బాస్మతి రైస్ కంటే మంచి సువాసన కలిగిన రైస్ అని ఒక కంకి కి30 నుండి 40 వడ్లు వస్తాయని తెలిపారు. సెకండ్ ఇయర్ మరియు ఫైనల్ ఇయర్ విద్యార్థులు తాము పండించిన పంట ను వుత్సహంగా కోసి 10 బస్తా లకు నింపారు. కృష్ణ జిల్లా కనురు పెనమలూరు రైతులకు ఇవి ఇవ్వటం జరుగుతుందని తాము కష్టపడి పందించమని విద్యార్థినులు ఆనందం వ్యక్తపరిచారు. అధ్యాపకులు మనోజ్,మరియు ఇతర ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *