-అధికారులు సమన్వయంతో ఆడుదాం ఆంధ్రా విజయవంతానికి చర్యలు.
-ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకోనెల యువతాను ప్రోత్సహిస్తున్నాం.
-జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్రా క్రీడా సంబరాలకు సన్నాహాక ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని క్రీడా పోటీలలో పాల్గొని ప్రతిభను ప్రదర్శించేలా యువతను ప్రోత్సహిస్తున్నామని అధికారులు సమన్వయంతో ఆడుదాం ఆంధ్రాను విజయవంతం చేసేలా చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్ . ఢిల్లీరావు ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు, క్రీడలు, యువజన సర్వీసుల ప్రిన్సిపల్ సెక్రటరీ పీఎస్ ప్రద్యుమ్న, శాప్ ఎండీ హెచ్ఎం ధ్యానచంద్ర కు వివరించారు.
ఆడుదాం ఆంధ్రా కార్యక్రమ నిర్వహణ చేపట్టిన ఏర్పాట్లపై శుక్రవారం ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు, క్రీడలు, యువజన సర్వీసుల ప్రిన్సిపల్ సెక్రటరీ పీఎస్ ప్రద్యుమ్న, శాప్ ఎండీ హెచ్ఎం ధ్యానచంద్ కలిసి రాష్ట్రంలోని జిల్లా కలెక్టరేట్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంనుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ యువత క్రీడలను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకొని ఆరోగ్యకర జీవన విధానాన్ని అనుసరించేలా ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిన ఆడుదాం.. ఆంధ్రా కార్యక్రమ విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. డిసెంబర్ 15 నుంచి జనవరి 25 వరకు నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్రా క్రీడా సంబరాలలో యువ క్రీడా కారులు పాల్గొని వారి క్రీడా ప్రతిభను ప్రదర్శించేలా కృషి చేస్తున్నామన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో కాంపిటీటివ్ కేటగిరీలో క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో అయిదు అంశాల్లోనూ నాన్ కాంపిటీటివ్ కేటగిరీలో యోగా, టెన్నీక్వాయిట్, మారథాన్, స్థానిక ప్రధాన్యమున్న సంప్రదాయ క్రీడల్లో పోటీలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. 15 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనేలా ఈ నెల 20తేదీ నుండి క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడంతో పాటు సచివాలయ వాలంటీర్ల ద్వారా ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రత్యేక బుక్‌లెట్‌ల ద్వారా ప్రచారం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంగా మహిళా క్రీడాకారులు భాగస్వాములయ్యేలా ప్రోత్సహింస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని సజావుగా గ్రామ, నిర్వహించేందుకు మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆర్గనైజింగ్ కమిటీల ఛైర్మన్లు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్రీడా సంబరాలలో జిల్లాకు చెందిన జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు స్పోర్ట్స్ అంబాసిడర్ల సేవలను వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ వివరించారు. స్పోర్ట్స్ వాలంటీర్లు, పాఠశాలలకు చెందిన పీఈటీలు, ఫీజికల్ డైరెక్టర్లను క్రీడా సంబరాలలో భాగస్వామ్యం చేయడం జరిగిందని క్రీడా సామగ్రితో పాటు జనవరి 26వ తేదీన నిర్వహించనున్న ముగింపు కార్యక్రమానికి అవసరమైన బహుమతులు, ట్రోఫీలు సిద్ధం చేసుకొని ప్రజాప్రతినిధుల సమన్వయంతో కార్యక్రమా విజయవంతానికి కృషి చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా క్రీడా మైదానాలను ఆడుదాం ఆంధ్రా సంబరాలు నిర్వహించేందుకు సిద్ధం చేయాలని మైదానాలు నిర్వాహకులు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు వివరించారు.