-26 వ డివిజన్ ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు మంచి చేసే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024లోనూ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 26 వ డివిజన్ 30 వ వార్డు సచివాలయ పరిధిలో శుక్రవారం జరిగిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డి, వైసీపీ డివిజన్ ఇంచార్జి అంగిరేకుల నాగేశ్వరరావు గొల్లభామ, కోఆర్డినేటర్ కోలా నాగాంజనేయులుతో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించి.. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేసిన మేలును మల్లాది విష్ణు వివరించారు. సంక్షేమ పథకాలతో చేకూరిన లబ్ధి గురించి అవగాహన కల్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోసారి మోసం చేసేందుకు టీడీపీ నేతలు కల్లబొల్లి మాటలు చెబుతారని.. వాటిని నమ్మొద్దని సూచించారు. చంద్రబాబు హయాంలో ఏ ఒక్క పేదవాడికి న్యాయం జరగలేదని.. రాష్ట్రానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవసరం ఎంతో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయ పరిధిలో “సంక్షేమ పథకాల బోర్డు” ను ఆవిష్కరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఊహకందని రీతిలో సంక్షేమ కార్యక్రమాల అమలు, అభివృద్ధి పనులు ఈ ప్రభుత్వం చేపట్టినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. 30వ వార్డు సచివాలయ పరిధిలో గత నాలుగున్నరేళ్లలో 2,059 మందికి 5 కోట్ల 96 లక్షల 66 వేల 477 రూపాయలు డిబిటీ ద్వారా లబ్ధి చేకూర్చినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. అలాగే నాన్ డీబీటీ ద్వారా 655 మందికి కోటి 77 లక్షల 35 వేల 290 రూపాయలు.. మొత్తంగా 2,714 మందికి 7 కోట్ల 74 లక్షల 1 వేయి 767 రూపాయల లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. కనుక చంద్రబాబు నయవంచన పాలనకు, సీఎం జగన్ సువర్ణ పాలనకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలందరూ గమనించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును మరువరాదని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మాల్యాద్రి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు పిల్లుట్ల వంశీ, నాయకులు శనగశెట్టి హరిబాబు, కంభం కొండలరావు, సచివాలయ సిబ్బంది, కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొన్నారు.