విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గాంధీనగర్ ఐలాపురం హోటల్లో శుక్రవారం జరిగిన విలేకరులు సమావేశంలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా చిట్యాల ఐలమ్మ ప్రాంగణంలో పాతపాటి అంజిబాబు రజక ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలకు అతీతంగా జగనన్న రజక ఆత్మగౌరవ మహాసభ గోడపత్రికను ఆవిష్కరించడం జరిగింది .కృష్ణాజిల్లా రజక నాయకులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు .ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అంజి బాబు మాట్లాడుతూ ప్రతి రజకుడు ఇంటికొకరు చొప్పునజాతి కోసమని నినాదంతో రాష్ట్రంలో నలుమూలల నుంచి రజకులందరూ పాల్గొని సభ విజయవంతం చేయాలని ప్రధాన డిమాండ్ గా అన్ని రాజకీయ పార్టీలు రజకులకు సీట్లు కేటాయించాలని, రాజ్యాంగ పదమైనటువంటి, పదవుల్ని రజకులకు భాగస్వామ్యం చేయాలని చేనేత గౌడ కార్మికులకు ఇస్తున్న విధంగా 50 సంవత్సరాలకే పింఛన్ రజకులుకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. .ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానించారు… ఈ కార్యక్రమంలో కుందేంటి వీర వెంకటేశ్వరరావు కొండాయగుట్ట బలరాం , పిల్లుట్ల వంశి , బుద్ధ వెంకట్రావు , రావులపాటి గోపి, తాటిపూడి గణేష్ ,,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగమల్లేశ్వరరావు , నాగరాజు బీసీ సంక్షేమ సంఘం నాయకులు దాసరి తిరుపతి రావు ఊకోటి.శేషగిరిరావు మధు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …