విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తుంటే ప్రతిపక్ష నేతలు ఇష్టానుసారం విమర్శలు చేయడం తగదని ఎస్సీ కమిషన్ సభ్యుడు కె. బసవరాజు హితఫు చెప్పారు. శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు రాజకీయాలకు అతీతంగా మేలు జరిగే చక్కటి పరిపాలన జరుగుతుంది రానున్న ఎన్నికల్లో కుడా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అయితే రాజకీయ దుష్టశక్తులు కలసి దుష ప్రచారం చేస్తున్నారని వాటిని తిప్పికొట్టడానికి తనకు రాజ్యాంగబద్దమైన ఎస్సీ కమీషన్ సభ్యుడిగా ఉండటంతో దానికి రాజీనామా చేసి రాజకీయ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ వంటి దుష్ట శక్తులను రాష్ట్రం నుంచి తరిమేయాలన్నారు. తాను రాజ్యాంగ పదవిలో ఉన్నందున రాజకీయ విమర్శలు చేయడం లేదని.. తనకు పదవి ఇచ్చి ఆదరించిన సీఎం వైఎస్ జగన్ ను విమర్శిస్తుంటే తట్టుకోలేకపోతున్నానన్నారు. జగన్ ను ఓడించేందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, వారికి వత్తాసు పలుకుతున్న కొన్ని మీడియా సంస్థలు, కొమ్ము కాస్తున్న కొందరి పై నిరంతరం పోరాడతానన్నారు. తన రాజీనామ ఫాక్స్ ద్వారా సీఎంకు పంపిస్తానని అనంతరం ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు పార్టీ గెలుపుకోసం ప్రచారం చేస్తానని తెలిపారు.
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …