-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో స్పెషల్ సీ.ఎస్. వై శ్రీలక్ష్మి ఐఏఎస్ పర్యవేక్షణలో విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వపనిల్ దినకర్ పుండ్కర్ ఐఏఎస్ ఆధ్వర్యంలో అంబెడ్కర్ స్మృతి వనము పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి.
స్వరాజ్య మైదానంలో ఎంతో అద్భుతంగా నిర్మాణం జరుగుతున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను శుక్రవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు ఐ.ఏ.ఎస్. కమిషనర్ మాట్లాడుతూ ఆంబేడ్కర్ స్మృతి వనం పనుల కోసం వందలాది మంది కార్మికులు భారీ యంత్రాలతో రాత్రింబవళ్లూ పనులను కొనసాగి స్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా అంబేడ్కర్ స్మృతి వనం ప్రాజెక్టుపై దృష్టి సారించి పనులను సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో పనులు శరవే గంగా జరుగుతున్నాయి.
స్వరాజ్య మైదానంలో ఎంతో అద్భుతంగా 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన స్మృతి నిర్మాణం డిజైన్ల ఆధారంగా ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనుల్లో వేగం పెంచారు. సీలింగ్, ప్లాస్టింగ్ పనుల్లో జాప్యం లేకుండా చేస్తున్నారు. పనుల నాణ్యతా ప్రమాణాలను క్వాలిటీ కంట్రోల్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గ్రానైట్ ఫుట్పాత్, ల్యాండ్ స్కేప్, కాంపౌండ్ నిర్మాణం తుది దశకు చేరుకుంటున్నాయి. పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంగంణంలో అంద మైన రకరకాల పూలు, ఆకర్షణీయమైన మొక్కలతో గ్రీనరీ ఏర్పాటు చేయనున్నారు.