Breaking News

జిల్లా నీటి పారుదల, వ్యవసాయ సలహా మండలి ఉమ్మడి సమావేశం

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ లో ఈ నెల 8వ తేదీన జిల్లా కలెక్టర్ ల సమావేశం నందు ముఖ్యమంత్రి వారి కార్యాలయ వారు జిల్లా నీటి పారుదల సలహా మండలి మరియు వ్యవసాయ సలహా మండలి ఉమ్మడి సమావేశం ఈనెల 14వ తేదీన నిర్వహించాల్సిందిగా ఇచ్చిన ఆదేశాల మేరకు , జిల్లా ఇంచార్జి మంత్రి వారి దృష్టికి తీసుకువెళ్లగా, ఉదయం 10. 30 ని.లకు నిర్వహించుటకు మంత్రి సమయం నిర్ణయించియున్నారు. ఈ మేరకు ఈనెల 14వ తేదీ ఉదయం 10 . 30 ని.లకు జిల్లా నీటి పారుదల, వ్యవసాయ సలహా మండలి ఉమ్మడి సమావేశం నిర్వహించడమైనది. ఈ విషయాన్నీ కృష్ణా జిల్లా కలెక్టర్ వారికి వ్రాతపూర్వకంగా లేఖ ద్వారా జిల్లా పరిషత్ సీఈ ఓ ద్వారా తెలియపరచడమైనది. ఈ సమావేశం దృష్ట్యా కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ సమావేశానికి ఏ అధికారులు హాజరవుతారో, ఎవరు హాజరు కాలేరో ముందస్తుగా సమాచారం తెలియజేయడమైనది. ఇదే విషయాన్నీ జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక మరియు కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు, నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు లకు వ్యక్తిగతంగా ఫోన్ ద్వారా తెలియజేయడమైనది. అదేవిధంగా మచిలీపట్టణం  శాసనసభ్యులు పేర్ని వెంకటరామయ్య వారికి కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ వారి ద్వారా సమాచారం అందించడమైనది. జిల్లా కు చెందిన 5గురు జిల్లా అధికారులు తప్ప, ఐ ఏ ఎస్ అధికారులైన జాయింట్ కలెక్టర్, నూజివీడు సబ్ కలెక్టర్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ లతో పాటు మిగిలిన జిల్లా అధికారులు కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశానికి హాజరు కావడమైనది. ప్రజాస్వామ్య వ్యవస్థపై పూర్తి గౌరవం, విధులపట్ల విలువలతో కూడిన బాధ్యత ఉన్నందునే జిల్లా అధికారులకు కృష్ణా జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశానికి హాజరు కావడంపై పలుమార్లు లేఖలు, ఫోన్ ల ద్వారా తెలియజేసి వారిని పూర్తిస్థాయిలో సమాయత్తం చేయడం జరిగింది. మంగళవారం ఏలూరులో జరిగిన జిల్లా నీటి పారుదల సలహా మండలి మరియు వ్యవసాయ సలహా మండలి ఉమ్మడి సమావేశానికి జిల్లా ఇంచార్జి మంత్రి పినిపే విశ్వరూప్ తో పాటు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు, ఉన్నమట్ల ఎలిజా, శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకట రమణ, షేక్ సాబ్జి, వంకా రవీంద్రనాథ్ తదితరులు పాల్గొని గోదావరి జిల్లాలో అతిముఖ్యమైన రబీ పంటకు సాగు నీరు అందించే విషయంపై సమీక్షించడంతోపాటు, తాగునీరు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అదే విధంగా కృష్ణా, గోదావరి డెల్టాలో మంచినీటి వనరులు నింపే విషయంపై కూడా సమీక్షించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు అత్యవసరంగా జిల్లాలో రబీ సాగునీరు విషయంపై సమావేశం నిర్వహించవలసి వచ్చిందని తెలియజేయడమైనది.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *