రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రకారాగారము, రాజమహేంద్రవరం నందు రాష్ట్ర హోం మరియు విపత్తులు నిర్వహణ శాఖా మాత్యులు డా. తానేటి వనిత వారిచే రీజనల్ ట్రైనింగ్ సెంటర్ యొక్క శంకుస్థాపన కార్యక్రమం జరుపబడునని కేంద్రకారాగార పర్యవేక్షణాధికారి ఎస్. రాహుల్ మంగళ వారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ఇండక్షన్ ట్రైనింగ్, రిఫ్రెషర్ ట్రైనింగ్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్, ఓరియంటేషన్ కోర్స్ ట్రైనింగ్ నిర్వహించబడునని ఎస్. రాహుల్ తెలియచేసారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధులుగా జిల్లా ఇన్ చార్జి మంత్రివర్యులు & బి.సి. సంక్షేమం, ప్రజాసంబంధాల సమాచార సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ , పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ శాసన సభ్యులు ఆదిరెడ్డి భవానీ, ఏపి గ్రీనింగ్ & బ్యూటీషన్ కార్పోరేషన్ లిమిటెడ్, చైర్మన్ చందన నాగేశ్వరరావు, రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ & డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిసన్స్ & కరెక్షనల్ సర్వీసెస్స్, హరీష్ కుమార్ గుప్తా, ఇస్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ ఇస్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ ఐ.శ్రీనివాసరావు, DIG (కోస్తాంధ్ర ప్రాంతం) రవి కిరణ్ , ఈస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ కె. మాధవి లత, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఈస్ట్ గోదావరి జిల్లా పి. జగదీశ్ మరియు ఇతర ప్రముఖులు విచ్చేయుచున్నారు అని తెలియ చేశారు.
Tags rajamandri
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …