-మ్యూజిక్ వీడియో ఆల్బమ్స్‌లో నటించడం ఇష్టం
-అందాల ముద్దుగుమ్మ సోనమ్ దాష్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
అందం.. అభినయం.. ఆకర్షణ.. హాట్నెస్.. తన సొంత చేసుకున్న ఈ బ్యూటి ఒడిస్సా రాష్ట్రానికి చెందిన మోడల్. ర్యాంపు షోలలో ఒంపుసొంపులతో కుర్రకారును ఉర్రూతలూగించిన ఈ అందాల ముద్దుగుమ్మ పేరు సోనమ్ దాష్. తెలుగు చిత్రాల్లో నటించాలన్న తన అభిలాషను వ్యక్తం చేస్తూ సౌత్‌లో ఎంతోమంది టాలెంట్ ఉన్న దర్శకులని, మోడల్స్‌కి, యాక్టర్స్‌కి సరైన వేదిక హైదరాబాద్ అని తెలిపారు. ఈ ముద్దుగుమ్మ 2020లో మిస్ ఒడిస్సా ఇంటర్నేషనల్ ఇండియా విన్నర్ 2020 కిరీటాన్ని కైవసం చేసుకుని, సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని తెలుగు చిత్రాల వైపు ఆశగా ఎదురుచూస్తుంది. త్వరలో తెలుగులో అరంగేట్రం చేయబోతున్నానని రీసెర్చ్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలైన చైతన్య జంగా, పీవీఎస్ వర్మల ప్రోత్సాహంతో తెలుగులో అరంగేట్రం చేస్తున్నట్లు పేర్కొన్నారు.