Breaking News

ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు పై కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి రీ సర్వే, ఉపాధి హామీ, జలజీవన్ మిషన్, పిఎంజి , వైద్య ఆరోగ్య, ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు పై కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత జిల్లా ప్రగతిపై సమగ్ర నివేదికను వివరిస్తూ,  జిల్లాలో 3 దశ రీ సర్వే లో 90 గ్రామాల్లో గ్రామ , మండల స్థాయి లో 100 శాతం లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు. రీ సర్వే తదుపరి దశ పనులను వేగవంతం చేయడం జరిగిందన్నారు. వెబ్ లాండ్ లో రికార్డులను 100 శాతం అప్డేషన్ చేసినట్లు తెలిపారు. ఆర్ వో ఆర్ మాడ్యుల్ కి చెంది 126 గ్రామాలకు గాను 100 గ్రామాల్లో పూర్తి చేసినట్లు,26 గ్రామాల్లో సాంకేతిక పరంగా పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో కమిషన్ మార్గదర్శకాలు మేరకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మాధవీలత తెలియ చేశారు. ప్రతి బుధవారం రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వారీగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఇప్పటికే ఆయా నియోజక వర్గ రిటర్నింగ్ అధికారులకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు మాస్టర్ ట్రైనర్ ల ద్వారా కార్యశాల నిర్వహించినట్లు పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష 2 వ విడత లో ఇప్పటి వరకు 66 క్యాంప్స్ నిర్వహించి 27232 మందికి వైద్య సేవలు అందించినట్లు పేర్కొన్నారు. ఇంటింటి సర్వే ద్వారా 9607 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. జే ఏ ఎస్ రెండో విడత లో 167 మందికి తదుపరి వైద్య సేవలు కోసం సిఫార్సు చెసినట్లు తెలిపారు. మిగిలిన వారి ఆరోగ్య వివరాలు కోసం వాలంటీర్, వైద్య సిబ్బంది ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర వైద్య ఆరోగ్య సహాయ మంత్రి పర్యటన సందర్భంలో రాష్ట్రంలో అమలు జరుగుతున్న ఆరోగ్య సురక్ష పట్ల ప్రశంసలు ఇచ్చినట్లు తెలిపారు. జగనన్న కంటి వెలుగు కింద 1710 మందిని పరీక్షించినట్లు తెలిపారు. జిల్లాలో 130812 హెల్త్ కార్డులకు గానీ 7711 పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ యాప్ ను 279209 మంది డౌన్లోడ్ చేసుకోవడం జరిగిందన్నారు. ఉపాధిహామీ పథకంలో 48 లక్షల పనిదినాలకు గాను 44.25 లక్షలు లక్ష్యం సాధించినట్లు తెలిపారు. పూర్తి చేసిన ప్రాధాన్యత భవనాలు ప్రారంభించడం జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, జిల్లా ఎక్సైజ్ అధికారి సోమ శేఖర్ సిపివో ఎల్. అప్పల కొండ, డ్వామా పిడి ఏ . ముఖ లింగం, పిఆర్ ఎస్ ఈ … ఎ బి వి ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ బి. బాల శంకర రావు, వైద్యాధికారులు డా కె. వేంకటేశ్వర రావు, డా ఎన్. సనత్ కుమారి, తదితరులు పాల్గొన్నారు

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *