ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి రూరల్ నియోజక వర్గ పరిధిలో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఈ ఆర్ ఓ ఎస్. సరళా వందనం స్థానిక జెడ్పీ హై స్కూల్ లో సీనియర్ ఓటర్ సిటిజన్స్ ను సత్కరించారు. గురువారం స్థానిక జెడ్పీ హై స్కూల్ జాతీయ ఓటరు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సరళా వందనం మాట్లాడుతూ, ఓటు హక్కు పొందేందుకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఓటరుగా నమోదు కావాలన్నారు. నామినేషన్ ప్రక్రియ జరిగే వరకు ఓటరుగా నమోదు కి అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతి ఓటరు తప్పని సరిగా వారి ఓటు హక్కు వినియోగించు కోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. వ్యాసరచన, వ్రకృత్వ, చిత్ర లేఖనం పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ పి. చిన్నారావు, డిప్యూటీ తహశీల్దార్ సునీల్ లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News