Breaking News

కృషి విజ్ఞాన కేంద్రం, కలవచర్ల షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళిక కిసాన్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం స్థానిక కలవచర్ల కృషి విజ్ఞాన కేంద్రంలో షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళికలో భాగంగా ‘కిసాన్ మేళా’ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పొగాక పరిశోధనా సంస్థ (ICAR- CTRI), రాజమండ్రి డైరెక్టర్ డా. మాగంటి శేషమాధవ్ ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ కార్యక్రమానికి రాజానగరం, కలవచర్ల, నరేంద్రపురం, పిఠాపురం, గోకవరం, గుమ్మల దొడ్డ, గాదరాడ తదితర గ్రామాల నుండి సుమారు 270 మంది షెడ్యూల్ కులాల రైతులు, రైతు మహిళలు, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ అధికారులు, రాజానగరంలో గల ISTS విద్యార్థినులు, గుమ్మల దొడ్డ పంచాయతీ సెక్రెటరీ శ్రీమతి పి.వి. రమణకుమారి, రైతు ఉత్పత్తి దారుల పరస్పర సహకార సంఘాల సభ్యులు (పందూరు) మరియు కృషి విజ్ఞాన కేంద్రం స్టాఫ్ పాల్గొన్నారు. కిసాన్ మేళ సందర్భంగా కెవికెలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ను డా. మాగంటి శేషు మాధవ్, డైరెక్టర్, CTRI ప్రారంభించారు. ఈ స్టాల్స్ లో కె వి కె శిక్షణ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొంది, కొబ్బరి పీచుతో తాడు, డోర్ మాట్స్, అలాగే జనపనారతో బ్యాగులు, అలంకరణ వస్తువుల తయారీలో మాస్టర్ ట్రైనర్లుగా ఎదిగి, వారు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు. ప్రకృతి వ్యవసాయంతో(APCNF) అనుసంధానంగా పండించిన వివిధ రకాల దేశవాళీ వరి రకాలు, పంటల సస్యరక్షణ కషాయాలు, ముఖ్యంగా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ప్రోట్రేళ్లలో కూరగాయల నారు, పసుపులో అధిక కుర్కుమిన్ శాతం ఉన్న రకాలు, మామిడి అల్లం, అజోల్ల, జీడి మామిడి అంట్లు, పౌల్ట్రీలో కావేరి, అసిల్ కోళ్ల రకాలు, బ్లాక్ బెంగాల్ మేకలు, చేమ, అరటి రకాలు, నూట్రి గార్డెన్ ద్వారా రసాయనాలు పిచికారి చేయకుండా పండించిన కూరగాయల రకాలు, కిచెన్ వ్యర్ధాలను కంపోస్ట్ గా మార్చి ద్రవరూపంతో కంపోస్టులు తయారుచేసే యూనిట్లను ఎగ్జిబిషన్ స్టాల్స్ లో ప్రదర్శించారు. APCNF మరియు కెవికెలు సంయుక్తంగా ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. డా. మాగంటి శేషు మాధవ్, డైరెక్టర్,CTRI సభను ఉద్దేశించి మాట్లాడుతూ కేవీకే వారు మహిళా సాధికారత దిశగా ఎన్నో వినూత్నమైన వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను చేపడుతూ ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల మహిళలకు కొబ్బరి పీచు, జనపనారతో వివిధ రకాల ఉత్పత్తుల తయారీలో నైపుణ్య శిక్షణను కల్పిస్తున్నారని, తద్వారా ఔత్సాహిక ఎంటర్ప్రెన్యూర్షిప్ గా ఎదగడానికి అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ ఇంజనీరింగ్ కోర్సు చేస్తున్న విద్యార్థులను వివిధ వ్యవసాయ పనిముట్లను ఆధునికరించడంలో మరియు అధునాతన కృత్తిమ మేధాశక్తితో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు రావడానికి కృషి చేయాలని సూచించారు. ట్రాక్టర్ ద్వారా నడపబడే అనేక వ్యవసాయ పనిముట్లను ప్రదర్శించి, వాటి ఉపయోగాలను రైతులకు, విద్యార్థులకు, సందర్శకులకు వివరించారు. డా. వి.యస్.జి.ఆర్. నాయుడు, హెడ్, కెవికె స్వాగతోపన్యాసం చేస్తూ కెవికె షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళికలో లబ్ధిదారులను ఎంపిక చేసి వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా పనిముట్లను వివిధ మండలాలలోని ఎస్సీ రైతులకు, మహిళలకు అందచేస్తున్నామని తెలిపారు. డా. ఎస్. మాధవరావు డి.ఏ.ఓ. మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ రైతులు, రైతు మహిళలు ఉద్దేశించి ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల ద్వారా కెవికె వారు అందజేస్తున్న శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బి. తాతారావు, డి.పి.ఎం.- APCNF మాట్లాడుతూ వ్యవసాయాన్ని ఒక వృత్తిగా చేపట్టి వ్యాపారంగా మలుచుకున్నప్పుడే లాభదాయకంగా ఉంటుందని, యువత ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగానికి ఆసక్తి చూపించినప్పటికీ వ్యవసాయాన్ని కూడా చేపట్టాలని సూచించారు. కిసాన్ మేళా సందర్భంగా ఎస్సీ రైతులకు పలుగు+పార, టార్పాలిను, వరిలో కలుపు తీసే పనిముట్టు(Manual plant weeder), మహిళలు సునాయాసంగా న్యూట్రి గార్డెన్లో కూరగాయల నారు నాటే పనిముట్టు (easy planter) ను అందజేశారు. గుమ్మల దొడ్డకు చెందిన మహిళ గ్రూపులకు కొబ్బరి పీచుతో ఒకేసారి ఎక్కువమంది డోర్ మాట్లు తయారు చేసే ఫ్రేములను అందజేశారు. గోకవరంకు చెందిన రెండు ఎస్.సి. మహిళా గ్రూపులకు రెండు ఉషా కుట్టుమిషన్లను డైరెక్టర్ డా. శేషు మాధవ్  అందజేశారు. ఈ కిసాన్ మేళా కార్యక్రమంలో కెవికె స్టాఫ్ జె.వి.ఆర్. సత్యవాణి, కె. దిలీప్, ఎం.ఏ. రాజు, విజయ వర్ధన్, జె. ప్రబాత్, ఆర్.రత్నాజీ తదితరులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *