-ప్రజల శ్రేయస్సే ప్రధాన ధ్యేయం
-నగరాభివృధే ప్రధాన లక్ష్యం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల శ్రేయస్సే ప్రధాన ధ్యేయంగా నగరాభివృధే లక్ష్యంగా 2024-25 సంవత్సరానికి బడ్జెట్ ఉండాలని బడ్జెట్ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఉదయం విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో తమ ఛాంబర్ లో నగరపాలక సంస్థ అన్ని శాఖధిపతులతో 2024-25 సంవత్సరపు బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా నగర అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా 2024-2025 సంవత్సరపు అంచనాలు ఉండాలని శాఖధిపతులతో అన్నారు. దానికనుగుణంగా వివిధ శాఖల్లో కేటాయించిన బడ్జెట్ రాబోవు కాలానికి అవసరమైన బడ్జెట్ గురించి చర్చించారు. అధికారులకు నగరాభివృద్ధి ఫై తగు సూచనలు చేసి, ప్రజాప్రయోజనాల గురించి అవసరమగు పనులకు తగిన బడ్జెట్ ప్రతిపాదనల తో మరోసారి సమీక్ష సమావేశానికి జారీ చేసిన సూచనలు కనుగుణంగా బడ్జెట్ అంచనాల నివేదికను తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
Prajavartha Online Telugu News