Breaking News

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ గా నమోదు చేసుకోవాలి

– ఓటు హక్కు పొంది వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలి
-జిల్లా కలెక్టర్.

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
18 సంవత్సరాలు పై బడిన అందరూ ఓటు హక్కు పొంది వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక కచ్చిపి కళాక్షేత్రం నందు నగర పాలక సంస్థ కమిషనర్ మరియు ఈ ఆర్ ఓ డి. హరిత, ఆర్ డి ఓ లు మరియు ఈ ఆర్ ఓ ల తో కలిసి 14వ జాతీయ ఓట దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1950 సంవత్సరంలో ఎన్నికల సంఘం ఏర్పాటు అయిందని,2011 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం జనవరి 25 న జాతీయ ఓటర్ దినోత్సవం జరువుకుంటున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు పై బడిన అందరూ ఓటు హక్కు పొంది వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల అన్నింటి కంటే ముఖ్య మైనది ఓటు హక్కుని, ఓటు హక్కు సమాజానికి సంబందించిదని తెలిపారు. ఓటు వల్ల నాకు ఏమీ ఉపయోగం ఉందని అనుకో రాదని, మీరు ఎన్నుకొని ప్రభుత్వము మీ హక్కులను కాపాడే ప్రభుత్వం గా ఉండాలంటే అందరూ ఓటు హక్కును వినియోగించే కోవలన్నారు. కులం,మతం,డబ్బులు చూడకుండా వంద శాతం ఓట్లు వేసినట్లు అయ్యితే అబ్బుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చుఅన్నారు. జిల్లాలో 79 శాతం మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారని మిగిలిన 31 శాతం మంది కూడా ఓటుకు వినియోగించుకోవడానికి,ఓటు హక్కు వినియోగం పై జిల్లా యంత్రాంగం అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అంత చదువు కున్న వారేనని రాష్ట్ర లో అక్షరాస్యత కూడా బాగుందని, ప్రజల వాయిస్ ఓటు హక్కు అని ఓటు హక్కు ద్వారా మంచి ప్రభుత్వాన్ని నియమించుకోవడం జరుగుతుందన్నారు. కులాలకు, మతాలకు, డబ్బుకు లొంగకుండా నిర్భయంగా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలన్న ముఖ్య ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా 18, 19 సంవత్సరాల యువతకు ఓటు హక్కుకు ప్రోత్సహిస్తుదన్నారు. మన దేశం అన్ని దేశాల కంటే ఎంతో అభివృద్ధి సాధించిందని, రాబోయే కాలంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థికంగా అభివృది చెందిన దేశం అవుతుందన్నారు. జిల్లాలో సుమారు 53 వేల మంది 18,19 సంవత్సరాలు నిండిన యువత ఓటర్లుగా నమోదు చేసుకోవడం జరిగిందని, 18 సంవత్సరాలు నిండిన యువత ఫారం 6 ద్వారా ఓటర్ గా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ లు మరియు ఈ ఆర్ ఓలకు ,ఏ ఈర్ ఓ లకు మరియు బి యల్ ఓ లకు, ప్రశంసా పత్రాలను,
18 సంవత్సరాలు నిండి ఓటర్ గా నమోదైన యువతకు ఓటర్ గుర్తింపు కార్డులను జిల్లా కలెక్టర్, కమిషనర్ పంపిణీ చేశారు, 5 మంది వయోవృద్ధుల కు సన్మానం చేశారు, అనంతరం కమిషనర్ ఓటు హక్కు వినియోగంపై ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. అంతకు ముంది నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద తిరుపతి ఆర్డీఓ తహశీల్దార్ ల తో కలసి 14 వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఓటర్ నమోదు,ఓటు హక్కు వినియోగం పై ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఇక ఓటరుగా నమోదు చేసుకోకుంటే వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని,ఓటర్ జాబిత లో మీ పేరు ఉందొ లేదు చూచుకోవాలని, లేక పోతే 6 ఫారం ద్వారా నమోదు చేయుకోవచ్చునని తెలిపారు. ఈ ర్యాలీ నగర పాలక సంస్థ కార్యాలయం నుండి కచ్చిపి కళా క్షేత్రం వరకు నిర్వహించిన ర్యాలీలో బి యల్ ఓ లు,సచివాలయ ,కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ జి యం. వి ఆర్.చంద్రమౌళి, ఆర్డీ ఓలు మరియు ఈ ఆర్ ఓ లు, ఏ.నిశాంత్ రెడ్డి,యం.కిరణ్ కుమార్,ఆర్.చంద్ర ముని,యన్.రవి శంకర్ రెడ్డి,శ్రీనివాసులు, అర్బన్ తహశీల్దార్ వెంకటరమణ, ఏ ఈ ఆర్ ఓ లు రమేష్ బాబు, ప్రేమిలా,సుబ్రహ్మణ్యం, ముని శైలజ, భూపతి, వై సుబ్రమణ్యం, బియల్ ఓ లు,సూపర్వైజర్లు, మోహన్,సుజాత,హరిబాబు,గిరి,అనురాధ,రాజశేఖర్,వినోద్ కుమార్,సచివాలయ సిబ్బంది కళాశాల విద్యార్థులు వయోవృద్ధులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *