విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో సుమధుర కళానికేతన్ వారి 26వ తెలుగు హాస్య నాటికల పోటీలు, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మొగలరాజపురం సిద్ధార్థ ఆడిటోరియంలో జరుగుతాయని సంస్థ అధ్యక్షుడు సామంతపూడి నరసరాజు తెలిపారు. మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అదే వేదికపై సుమధుర 50 వార్షికోత్సవ వేడుక కూడా జరుగుతుందని తెలిపారు. పోటీలలో మొదటిరోజు రెండు నాటికలు, రెండవ రోజు మూడు నాటికలు, మూడవరోజు మూడు నాటికలు, నాలుగో రోజు ఒక నాటిక ప్రదర్శితమవుతాయని, ఇవి గాక రెండు నాటికలు ప్రత్యేక ప్రదర్శనలుగా ప్రదర్శితమవుతాయని తెలిపారు. మొదటి రోజు ఫిబ్రవరి 1వ తేదీ రావి కొండలరావు, రాధాకుమారి స్మారక అవార్డును గుడివాడ లహరికి, శనగల కబీర్ దాసు స్మారక పురస్కారం దీర్ఘాసి విజయభాస్కర్ కు, నాల్గవ రోజు బహుమతి ప్రదానం అనంతరం జంధ్యాల స్మారక పురస్కారాన్ని బుర్ర సాయి మాధవ్ కు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. అలానే యువతను ప్రోత్సహిస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు క్రమం తప్పక నిర్వహిస్తూ వస్తున్నామని, అదేవిధంగా పేద కళాకారుల పిల్లల విద్యాభివృద్ధికి ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నామని, పేద కళాకారుల కుటుంబాలకు పలు విధాలుగా సేవలందిస్తూ వస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు డాక్టర్ ఎంసి దాస్, ప్రధాన కార్యదర్శి పి విజయ భాస్కరశర్మ, ఆర్గనైజింగ్ సెక్రటరి పిఎస్ఎన్ మూర్తి, కోశాధికారి డివి శివరాం, ఇవి సాగర్, బోడి ఆంజనేయరాజు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …