Breaking News

గుడ్లవల్లేరు మండలంలో నాలుగో విడత ఆసరా కార్యక్రమం

-9 కోట్ల,76 లక్షల ఆసరా చెక్కును విడుదల చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని…
-రాజకీయ స్వార్థానికి చంద్రబాబు ఎవరికాళ్ళైన పట్టుకుంటాడు…
-ఇచ్చిన మాట కోసం ప్రాణమైన తృణపాయంగా వదిలే వ్యక్తి జగన్….
-2009 ఎన్నికల బ్యాలెట్ లో ఓటర్లు బంధించిన చంద్రముఖి… గ్లాసు పట్టుకొని, సైకిలేక్కి లక.లక..లక… అంటూ డ్రాకులాల ప్రజల రక్తం తాగేందుకు రోడ్లపైకి వస్తున్నాడు…

గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుడ్లవల్లేరు మండల పరిధిలో నాలుగో విడత ఆసరా కార్యక్రమం ఘనంగా జరిగింది. గుడ్లవల్లేరు లో జరిగిన కార్యక్రమంలో మండల పరిధిలోని 974 గ్రూపులలోని,9577 మంది అక్కచెళ్లమ్మలకు 9 కోట్ల,76లక్షల,50వేల,7వందల,95 రూపాయల జంబో చెక్కును ప్రజాప్రతినిధులు, డ్వాక్రా సంఘాల సభ్యులతో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ. రాష్ట్రానికి చేసిన అభివృద్ధి, ప్రజలకు చేసిన మంచి కార్యక్రమాలతో సీఎం జగన్ మీ ముందుకు వస్తున్నాడన్నారు. ప్రజలకు చెప్పుకోవడానికి ఏమీ లేక జనసేన, బిజెపిలతో కలిసి వస్తున్న చంద్రబాబు మరోసారి కల్లబొల్లి మాటలు చెప్పేందుకు సిద్ధమయ్యాడన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చేసిన మంచిని చెప్పుకుంటూ నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలంటూ సీఎం జగన్ ఎలుగేత్తి చాటి చెబుతున్నాడని ఎమ్మెల్యే నాని పేర్కొన్నారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలకు 70% రాజకీయ పదవులు ఇచ్చిన సీఎం జగన్ కు, ఎన్నికల తర్వాత పేద వర్గాలను పట్టించుకోని చంద్రబాబుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎమ్మెల్యే నాని అన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన విద్యార్థుల కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక, ఎంపీపీ సురేష్, వైస్ ఎంపీపీ సాయన రవి, వైసీపీ నాయకులు కోటప్రోలు నాగు, పాలేటి చంటి, ఉప్పాల రాము, పడమటి సుజాత,వేమవరం కొండలమ్మ దేవస్థానం చైర్మన్ శేషం గోపి, మాజీ చైర్మన్ తాళ్లూరు మాధవ్, పిఎసిఎస్ అధ్యక్షుడు దుగ్గిరాల శేషుబాబు, వ్యవసాయ సలహా కమిటీ జిల్లా డైరెక్టర్ పెన్నేరు ప్రభాకర్,గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి జాన్ విక్టర్, వైసిపి జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగు మాల కాళీ,ఎంపీటీసీ పెనుమాల పూర్ణిమ, రంగారావు, దుగ్గిరాల శేషుబాబు,డోకిపర్రు రామిరెడ్డి, వడ్లమన్నాడా గోపి, గుదే రవి,మండల పరిధిలోని వెలాధిమంది డ్వాక్రా సంఘాల మహిళలు, ప్రభుత్వ శాఖల అధికారులు, మండలంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు అభిమానులు , సచివాలయ కన్వీనర్ లు , గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *