విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక గురువారం నిర్వహించారు. రైతు సాధికార సంస్థ, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యవర్గం ఏకగ్రీవంగా జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షులుగా కె.రఘురామ్ (విజయవాడ అర్బన్ వ్యవసాయ అధికారి) ఉపాధ్యక్షురాలిగా ఎమ్. స్వప్న (వ్యవసాయ అధికారి, జిల్లా కార్యాలయం, విజయవాడ) కార్యదర్శిగా ఆర్.సురేష్ (వ్యవసాయ అధికారి, రెడ్డిగూడెం) కోశాధికారిగా షేక్ టిప్పు సుల్తాన్ (వ్యవసాయ అధికారి, ఏ.కొండూరు)సంయుక్త కార్యదర్శిగా ఎస్.వాణి అనూష,వ్యవసాయ అధికారి, (జీవ నియంత్రణ ప్రయోగశాల, ఇబ్రహీంపట్నం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నూతన కార్యవర్గం ఎంపికలో రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షులు బాల భాస్కర్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, కోశాధికారి మురళీ కిషోర్ పాల్గొన్నారు. నూతన కార్యవర్గ ప్రమాణ అనంతరం పదవులు స్వీకరించిన నాయకులు మాట్లాడుతూ సంఘ కార్యాలయ భవనాన్ని మరింత విశాలంగా రూపొందించేందుకు కార్యాలయ భవనంపై మరో అంతస్తు నిర్మించడం, మహిళా ఉద్యోగులకు అవసరమైన సదుపాయాలు కల్పన వంటివి తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, వ్యవ సాయ శాఖ సిబ్బంది ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ప్రతినిధులు జే ఎ సి నాయకులు అభినందించారు. బాధ్యతతో పదవులు నిర్వహించాలని, శాఖలోని ఉద్యోగుల సంస్థల పట్ల సత్వరమే స్పందించి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు.
Prajavartha Online Telugu News